Khammam Politics: బీజేపీ నేతలతో భేటీ కానున్న పొంగులేటి
Khammam Politics: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో పొంగులేటి చేరుతారని స్పష్టమైనప్పటికీ. ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆయన అభిమానులతో పాటు, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర విషయంగా మారింది. ఈ నేపధ్యం లో బీజేపీ నేతలు గురువారంనాడు భేటీ కానున్నారు. మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ చేరికల కమిటీ నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం కానున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బీజేపీ నేతల లంచ్ భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలో చేరాలని ఎమ్మెల్యే రఘునందనరావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా మరి కొందరు నేరుగా పొంగులేటితో భేటీ కానున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో గత మాసంలో రాహుల్ టీమ్ చర్చించారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో తాను సూచించిన అభ్యర్ధులకు టిక్కెట్లు కేటాయించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇవాళ బీజేపీ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో భేటీ అయ్యేందుకు బీజేపీ నేతలు వస్తున్నందున మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ నేతల బృందం కూడా రానుందని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పొంగులేటి దారెటు? నేడు బీజేపీ నేతలతో భేటీ
2024 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ ను ఒక్క స్థానంలో కూడా గెలవకుండా చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తాను బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకత్వం తనను అవమానించిందని ఆయన విమర్శించారు. తనకు ఇచ్చిన హామీలను కూడ బీఆర్ఎస్ నాయకత్వం అమలు చేయలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.
ఒకవైపు కాంగ్రెస్ మరొక వైపు బీజేపీ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో చేరికలకు సంబంధించిన హామీల పైన రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్చ ఇచ్చింది. ఈ క్రమంలో పొంగులేటితో భేటీ కీలకం కానుంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి చెందిన ప్రతినిధులు సైతం ఇప్పటికే పొంగులేటితో చర్చలు జరిపారు.
కానీ రాష్ట్ర జిల్లా నాయకత్వం నుంచి సీట్ల కేటాయింపులో వచ్చిన అభ్యంతరాలతో నిర్ణయం పెండింగ్ లో పడింది. ఈ సమయంలో బీజేపీ నేతలు నేరుగా పొంగులేటితో చర్చల ద్వారా తమ పార్టీలోకి ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారు. అటు జూపల్లితోనూ చర్చలు కొలిక్కి వచ్చాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
అయితే పొంగులేటితో చర్చలు ఫలిస్తే ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పొంగులేటి తన అనుచర వర్గంతో బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. దీంతో, నేటి పరిణామాలు ఖమ్మం రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి.