నేడు నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో అప్పటి వరకు అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాల వారిగా పర్యటనలకు వెళ్తున్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా లో పర్యటించి అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం. నేడు నాగర్‌‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు.  ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు నాగర్‌కర్నూల్‌లో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్‌లో 52 కోట్ల రూపాయల వ్యయంతో కలెక్టరేట్, 35 కోట్ల రూపాయలతో ఎస్పీ కార్యాలయ భవన సముదాయాలను నిర్మించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో అవి నిర్మితం అయ్యాయి.

మరో రూ.60కోట్లతో జడ్చర్ల -నాగర్‌కర్నూల్‌ వయా సిర్సవాడ ఆర్‌అండ్‌బీ రహదారి పనులు నడుస్తున్నాయి. రూ.11కోట్లతో వెజ్‌, నాన్‌వెజ్‌ సమీకృత మార్కెట్‌ సముదాయం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.1.20కోట్లతో పట్టణంలో జంక్షన్ల ఆధునీకరణ. ఉయ్యాలవాడ, కొల్లాపూర్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.35లక్షలతో కలెక్టరేట్‌ వద్ద మిషన్‌ భగీరథ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. రూ.20లక్షలతో స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్‌ నిర్మాణం, మరో రూ.50లక్షలతో కొత్తగా పనులు చేపట్టారు.రూ.30కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్‌బండ్‌ జిల్లాకేంద్రానికే తలమానికంగా మారింది. నీటి మధ్యలో బుద్ధ విగ్రహం, పక్కనే బతుకమ్మ ఘాట్‌, బ్రిడ్జి పట్టణవాసులను ఆకట్టుకుంటున్నాయి. రూ.2.5లక్షలతో జాతీయజెండాను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.

అయితే ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్  ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జిల్లా కేంద్రం సమీపంలోని వెలమ ఫంక్షన్ హాల్ పక్కన 40 ఎకరాల్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలను, బీఆర్ఎస్ కార్యకర్తలను తరలించేలా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంతో పాటు కొల్లాపూర్ చౌరస్తా వరకు నాలుగు కిలో మీటర్ల పొడవునా గులాబీమయమైంది. కేసీఆర్ ప్రారంభించనున్న బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh