Karnataka Results: కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆధిక్యంలో కాంగ్రెస్
Karnataka Results: కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనందున, మే 10న ఎన్నికలు జరిగిన కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలపై అందరి దృష్టి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది, ఇందులో 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎన్నికల సంఘం ప్రకారం, మే 10న ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది, 72.68% పైగా ఓటింగ్ నమోదైంది, ఇది 2018ని మించిపోయే అవకాశం ఉంది. గణాంకాల చివరి సయోధ్య తర్వాత గణాంకాలు . Karnataka Results: అయితే ఫలితాలు వెలువడుతున్న కొద్దీ సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి.
జనతాదళ్ (సెక్యులర్) ఫర్వాలేదనిపించుకుంటోంది. ప్రారంభంలో ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చనే అంచనాలు ఉన్నాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ హవా కనిపిస్తోంది .పార్టీఆధిక్యంగెలుపుకాంగ్రెస్1120, బీజేపీ730, జేడీఎస్270, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా ఉన్నాయి. సుమారు 49 సీట్లలో ఇరు పార్టీలు కేవలం 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాయి. 32 సీట్లలో కేవలం 500 ఓట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. చివరివరకు ఫలితాలు ఉత్కంఠగా మారనున్నాయి
చిక్‌బళ్లాపురాలో వైద్యారోగ్య శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ కే సుధాకర్ వెనుకంజలో ఉన్నారు. మల్లేశ్వరం అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వర్థనారాయణ ఆధిక్యతలో ఉన్నారు. కర్ణాటకలో Karnataka Results: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 113. ప్రారంభ ఫలితాల్లో ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకునేలా కనిపించట్లేదు.
అయితే గత ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఓటమిపాలైన కొల్లెగాల్ కాంగ్రెస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తి ఈసారి మాత్రం ప్రత్యిర్థకి అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్‌పై 17,699 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ తనయుడు, జేడీఎస్ నేత రేవణ్ణ ఎదురీదుతున్నారు. హోలెనరిసిపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. సమీప ప్రత్యర్థి కంటే వెనుకబడ్డారు.
కర్ణాటక ఎన్నికల్లో హనుమాన్ నినాదం ప్రధాన అంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిమ్లాలోని హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా హైకమాండ్ మందస్తు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ లోటస్‌కు బీజేపీ తెరతీసే అవకాశం ఉందని భావిస్తోన్న అధిష్ఠానం.. రంగంలోకి దిగింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బెంగళూరుకు రావాలని ఆదేశాలు జారీచేసింది.