చిరంజీవి సినిమానే క్రాస్ చేసిన కాంతార
దక్షిణాది నుంచి పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటిన చిత్రాల్లో ‘కాంతార’ ఒకటి. రూ.16 కోట్లతో రూపొందిన ఈ చిత్రం సైలెంట్‌గా విడుదలైన సెన్సేషన్ క్రియేట్ చేసింది. కన్నడ సినీ చరిత్రలో కె.జి.యఫ్ 2 వసూళ్ల ప్రకారం ఓ రికార్డ్ క్రియేట్ చేస్తే దాన్నే ‘కాంతార’ దాటేసింది. మన తెలుగు విషయానికి వస్తే తెలుగు హీరోల సినిమాలకు రాని టి.ఆర్.పి రేటింగ్స్ కన్నడ నుంచి తెలుగులో అనువాదమైన ‘కాంతార’ మూవీకి రావటం విశేషం. హింది తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్స్‌నే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు ‘కాంతార’ సినిమా మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో థియేటర్స్‌లో సెన్సేష హిట్ కొట్టిన సినిమాలు బుల్లి తెరపై ఓ మోస్తరు రేటింగ్స్‌నే రాబట్టాయి. అయితే సినీ సర్కిల్స్ సమాచారం మేరకు రీసెంట్గా స్టార్ మాలో ప్రసారమైన ఈ చిత్రానికి 12.35 రేటింగ్స్ వచ్చాయట. నిజంగా ఇది గొప్ప విషయమనే చెప్పాలి. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా టీవీలో ప్రసారమైతే ఆ చిత్రానికి 7.7 రేటింగ్స్ వస్తే కాంతారకు 12.35 రేటింగ్స్ వచ్చాయి. భూత కోల సంస్కృతిని తెలియజేస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమిగౌడ హీరోయిన్. కానీ కాంతార సినిమా చివరి నిమిషంలో ఆస్కార్ అవార్డ్స్ కు షార్ట్ లిస్ట్‌లోకి వెళ్లగలిగింది కానీ నామినేట్ కాలేకపోయింది. అయితేనేం కాంతార ఇచ్చిన సక్సెస్ కిక్‌తో ఇప్పుడు హోంబలే ఫిలింస్ కాంతార 2 పేరుతో ప్రీ క్వెల్ చేయటానికి సన్నాహాలు చేస్తుంది. ఎలాగైనా ఈసారి కాంతార 2తో ఆస్కార్‌లో సత్తా చాటాలని నిర్మాతలు గట్టి నిశ్చయంతోనే వున్నట్లు సమాచాం.