Kalthi Madhyam: కల్తీ మద్యనికి ఐదుగురు బలి… వీరికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రసక్తే లేదు ?
Kalthi Madhyam కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన బీహార్ లోని మోతీహరి జిల్లాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మోతీహరి జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఈ మరణాలు సంభవించాయి. మరో పన్నెండు మంది కూడా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని Kalthi Madhyamప్రభుత్వం 2016 ఏప్రిల్ లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది.
ఈ నిర్ణయంతో గణనీయమైన సంఖ్యలో మహిళా ఓటర్ల మనసు గెలుచుకుంది. అయితే నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్థానికంగా తయారైన కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఈ ఏడాది జనవరిలో సివాన్ లో కల్తీ మద్యం తాగి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత బీహార్ పోలీసులు రాష్ట్రంలో మద్యం వ్యాపారం, నిల్వ, కొనుగోళ్లకు సంబంధించి 16 మందిని అరెస్టు చేశారు. శానిటైజర్ తయారీ నెపంతో లిక్కర్ మాఫియా కోల్ కతా నుంచి ఇథనాల్ ను తీసుకొచ్చిందని, అయితే దానితో రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ 15 మందిని అరెస్టు చేయగా, వీరిలో ఎనిమిది మంది మద్యం వ్యాపారులు ఉన్నారు.
వారి నుంచి స్వదేశీ, విదేశీ బ్రాండెడ్ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది బిహార్లోని ఛప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా ఏకంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
Kalthi Madhyam అయితే కల్తీమద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తాగితే చస్తారని, మద్యం జోలికి వెళ్లొద్దని కరాకండీగా చెప్పారు. లిక్కర్ అమ్మకాలపై మేం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.