KA Paul in Munugode: Center of Attraction గ మారిన కేఏ పాల్.. పది వేళ్ళకు ఉంగరాలు.. ఎందుకంటే.. సరికొత్త రీజన్ తో ఎదురు ప్రశ్న..
పోలింగ్ కేంద్రం వద్ద పాల్ ఓ కొత్త వాదన తెరమీదికి తెచ్చారు పాల్.. నిబంధనలకు విరుద్దంగా ఒంగరాలు ఎలా పెట్టుకొస్తారు అని ఎవరైనా ప్రశ్నిస్తే.. కారుగుర్తు టీఆర్‌ఎస్ వాళ్లు కారుల్లో ఎందుకు తిరుగుతున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నా
రు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో తనదైన శైలిలో హంగామా చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, అభ్యర్థి కేఏపాల్ .. పోలింగ్ రోజు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ఓరకంగా చెప్పాలంటే తనదైన ఆంగికంతో కేఏ పాల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రజలు అతన్ని ఆకర్షణీయంగా గుర్తించారు. పోలింగ్ బూత్ దగ్గర పది వేళ్లకు పది ఉంగరాలు ధరించి తన గుర్తును హైలైట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. పాల్ బృందం పోలింగ్ స్టేషన్ల దగ్గర సందడి చేస్తున్నారు. అంతకు ముందు ప్రచారంలోను తనదైన శైలిని ప్రదర్శించారాయన. ఆట, పాట… అంతకుమించి వార్నింగ్‌లతో మునుగోడు ప్రచారంలో హైలైట్‌గా నిలిచారు కేఏ పాల్. కోపాలు, తాపాలతో పాటు వెరైటీ వేషాలు, సవాళ్లతో అందరినీ ఆకట్టుకున్నారాయన. ప్రారంభం నుంచి ఓటర్లలో ఫుల్ జోష్ నింపారు. తీన్మార్ స్టెప్పులతో కేక పెట్టించారు. సెలూన్‌లోకెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకుంటూ వీడియోలకు ఫోజులిచ్చారు. స్వీట్లు పంచుతూ, చెప్పులు కుడుతూ, గొర్రెలు కాస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు.
పోలింగ్ బూత్‌లలో సహకరించిన జర్నలిస్టులు, పోలీసు అధికారులు, సిబ్బందికి కేఏ పాల్ కృతజ్ఞతలు తెలిపారు. మంగోడో జిల్లాలో 52,000 మంది నిరుద్యోగులు, 53,000 మంది యువకులు హాజరై ఓట్లు వేశారని కెఎ తెలిపారు. పాల్ అన్నారు. 30వేలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి 3వేలు మాత్రమే ఇచ్చిందని, టీఆర్ ఎస్ పార్టీ 30వేలు కలిపి బంగారం ఇస్తామని చెప్పి 3వేలు ఇచ్చిందని ఆరోపించారు. డిపాజిట్ కూడా రాదనే భయంతో కాంగ్రెస్ పార్టీ కేవలం 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. అయితే, ప్రజాశాంతి పార్టీ మద్దతుదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు; వారు సిద్ధంగా ఉంటే పార్టీకి మద్దతు ఇవ్వగలరు. మునుగోడు, సంతాననారాయణపురం, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఓటర్ల స్పందనను తాను వీక్షించినట్లు ప్రొఫెసర్ తెలిపారు. వీరంతా ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్శన చాలా సమాచారం ఇచ్చింది.
కేఏ పాల్ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల రేసులో బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉందనే సంగతి జగమెరిగిన సత్యం. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ మూడు పార్టీలకు చెందిన నేతలు భారీ సంఖ్యలో మునుగోడు నియోజకవర్గాన్ని అనుక్షణం, అనువణువునా చుట్టేసి రావడటమే ఈ మూడు పార్టీల అభ్యర్థులను రేసులో నిలిచినట్టు గుర్తించేలా చేసింది. అయితే, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ మాత్రం ఈ మూడు పార్టీల ఛరిష్మాను పక్కకు నెట్టేసి తానే 50 వేల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేయడం ఏంటని జనం విస్మయానికి గురవుతున్నారు. కేఏ. పాల్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి నెటిజెన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాదండోయ్.. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించిన ఫలితాల్లోనూ కేఏ పాల్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.