JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?

Jr.NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?

JR NTR తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి..రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ స్థాయిలోనూ అనేక సంచలనాలు సృష్టించారు. సినిమాలోను ఆయనది ఓ ఘనమైన చరిత్ర. ఆయన అనంతరం సినీ రంగలో హరికృష్ణ, బాలకృష్ణ, JR NTR లు.. స్టార్ హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లోJR NTR ఒకరు. తనదైన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు పొందాడు.

అయితే గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాలపై కొందరు జూనియర్ ఎన్టీఆర్ ను పరుష పదజాలంతో దూషించారు. వైసీపీ ప్రభుత్వం.. నందమూరి కుటుంబపై దాడి చేస్తుంటే గట్టింగా స్పందించేరేమి? అంటూ కొందరు ఎన్టీఆర్ పై పరోక్షంగా విరుచకపడ్డారు. అయితే తాజాగా బాలయ్య..మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మహానేత అంటూ కీర్తించారు. బాలయ్య చేసిన ఆ పని.. మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం. అయితే ..వైఎస్ ను బాలయ్య కీర్తిచడంపై ఎన్టీఆర్ ను తిట్టిన వాళ్లు ఏమి అనలేదు. ” బాలయ్యను అనే ధైర్యం లేదా? ఆనాడు జూనియర్ JR NTR ను తిట్టిన వారు ఈ రోజు ఏమయ్యారు?” అని కొందరు విమర్శిస్తున్నారు.

ఏఅన్ స్టాపబుల్-2 షోలో నందమూరి నటసింహ బాలకృష్ణ.. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గొప్పగా కీర్తించారు. ఆయన మహానేతని, గొప్ప లీడర్ అని ప్రశంసించారు. రాజకీయాల్లో ప్రత్యర్ధులైన వారిని సైతం కీర్తించడం బాలకృష్ణ గారి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు. అనేక సందర్భాల్లో బాలకృష్ణ రాజకీయలకు అతీతంగా అందరిని కలుపుకుని పోతుంటారు. ఇతర పార్టీల నేతలపై ఆయన చూపించే గౌరవ మర్యాదలకు గతంలో జరిగిన అనేక ఘటనలే ఉదాహరణ. ఇక మరొకవైపు నందమూరి ఫ్యామిలీ విషయంలో వైకాపా దారుణంగా ప్రవర్తిచిదంటూ..

ఆ విషయంపై జూనియర్ JR NTR ఎన్టీఆర్ ఘాటుగా స్పందిచలేదని కొందరు తెలుగు తమ్ముళ్లు విమర్శించారు. నందమూరి ఆడబిడ్డకు అవమానం, యూనివర్సిటీ పేరు మార్పు వంటి వాటిపై JR NTR కొందరు తిట్టారు. అలాంటి వారు వైసీపీ ఆధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిని బాలకృష్ణ కీర్తిచడంపై నోరు మెదపడం లేదు. అంటే బాలకృష్ణను అనే ధైర్యం వారికి లేదా? అని కొందరు విమర్శిస్తున్నారు. బాలకృష్ణ చేసినది మంచి వ్యాఖ్యలే అయినప్పటికే ఎన్టీఆర్ ను తిట్టిన వారికి రుచించవు కదా? అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2.కుప్పంలో జగన్ ఎత్తుకు చంద్రబాబు పై ఎత్తు!!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం. ఇక్కడి నుంచి ఆయన వరుసగా ఏడుసార్లు విజయకేతనం ఎగరవేశారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పంపై దృష్టిసారించింది. రానున్న ఎన్నికల్లో కుప్పంలో కూడా గెలవాలంటూ ముఖ్యమంత్రి జగన్ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇక్కడి నుంచి చంద్రబాబుపై పోటీపడే భరత్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది.

బాధ్యతలన్నీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. స్థానికంగా బలమైన నాయకులను వైసీపీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇటీవలే చంద్రబాబు కుప్పం పర్యటన అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పదుల సంఖ్యలో టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లి వారిని పరామర్శించి వచ్చారు. టీడీపీ న్యాయ విభాగంద్వారా వారందరికీ బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.వీరంతా నియోజకవర్గంలో పార్టీ ఎలా ఉంది? ఎక్కడైనా బలహీనంగా ఉంటే ఏం చేయాలి? వెన్నుపోటు పొడిచినవారు ఎవరు? పార్టీలో కోవర్టులెవరు? టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు..

తదితరాలన్నింటిపై పనిచేస్తున్నారు. స్థానికంగా ఉండే నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిద్వారా ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె మండలాల్లో 75వేల కుటుంబాలున్నాయి. పార్టీశ్రేణులంతా యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఏ చిన్న తప్పు జరగకూడదన్న ఉద్దేశంతో నాయకులు పనిచేస్తుండగా దీన్ని చంద్రబాబునాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

3.రెండు సీట్ల కోసం పట్టుబడుతున్న తల్లీకొడుకులు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయముంది. కానీ ప్రధాన పార్టీల అధినేతలతోపాటు సీనియర్ నేతలు కూడా ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దపడుతున్నారు. అవసరమైన అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంటున్నారు. వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత పరిటాల సునీత ఒకరు.గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం పోటీచేసి ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన తనయుణ్ని గెలిపించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారా? అనే సందేహం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

అయితే శ్రీరాం మాత్రం ధర్మవరం నియోజకవర్గంలో పాగా వేశారు. రాజకీయంగా తన బలాన్ని అక్కడి నుంచి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో శ్రీరాం ధర్మవరం సీటును అడిగారు. మరోవైపు రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీచేస్తుందని చెప్పారు. కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇస్తానని అధినేత స్పష్టం చేశారు. అయినప్పటికీ రాప్తాడులో సునీత పాదయాత్ర చేస్తుండటంతోపాటు శ్రీరాం ధర్మవరంలో పాగా వేశారు. పాదయాత్రకు లభిస్తున్న స్పందనపట్ల సునీత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబానికి ఒక సీటేనని చంద్రబాబు ప్రకటించారు. ఈ కోవలో యనమల కుటుంబం,కేఈ కుటుంబం, పరిటాల కుటుంబంతోపాటు ఇతర సీనియర్ నేతల కుటుంబాలున్నాయి. అయినప్పటికీ వీరంతా రెండు స్థానాల కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. చివరకు కుటుంబానికి ఒకటే ఇస్తారా? లేదంటే ఒత్తిడికి తలొగ్గి కుటుంబానికి రెండు సీట్లు కేటాయిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

4.కవితకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత కు మరింతగా ఉచ్చు బిగుస్తోంది. కవిత పాత్రపై సీబీఐ, ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌కి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఇఫ్తికర్‌ షరీఫ్‌తో కవితకు లింకులున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీబీఐ, ఈడీ బయటపెట్టనుంది. ఇప్పటికే పూర్తి సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించాయి. కవితతో పాటు ఆప్ నేత సోమనాథ్ భారతితో ఇఫ్తికర్‌కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఇఫ్తికర్‌కు చెందిన ప్రత్యేక విమానాల్లో పలుమార్లు కవిత ప్రయాణించినట్లు చెబుతున్నారు.

ఇఫ్తికర్‌తో కవిత సెల్ఫీలు దిగినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఇఫ్తికర్‌కు 20 ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు షరీఫ్ ఫామ్‌హౌస్‌లో విందులు, వినోదాలు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇతను నిత్యం రాజకీయ నేతలకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు ప్రచారం ఉంది. త్వరలో ఇఫ్తికర్‌తో పాటు కవితను సీబీఐ, ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదే కేసులో గతంలో కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో కవిత ఆడిటర్ నివాసముంటున్నారు.

నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలో సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబునివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను కవిత ఖండించారు. తనకు ఎటువంటి నోటీసు రాలేదని ప్రకటించారు. ఢిల్లీలో కూర్చొని ఉన్న కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ట్విట్టర్‌లో విమర్శించారు.

వాస్తవాలను చూపించడానికి సమయాన్ని వెచ్చించాలని మీడియా సంస్థలకు కవిత విజ్ఞప్తి చేశారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు.. తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేస్తున్నానని కవిత తెలిపిన విషయం తెలిసిందే.

5.మారుతున్న ఏపీ రాజకీయాలు.. పవన్ ను వైసీపీ వదిలేస్తోందా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయా? టీడీపీ , జనసేన విడివిడిగా పోటీ చేయాలి అనుకున్న వైసీపీ వ్యూహం ఫలించిందా..? మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై.. విమర్శలతో విరుచుకుపడే వైసీపీ.. ఇప్పుడు టార్గెట్ మార్చిందా..? ప్రధాని మోదీ విశాఖ పర్యటన తరవాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీతో ప్రధాని భేటీ అయ్యాక, యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ఓట్ల చీలనివ్వం అంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు..

ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ నినదించడం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని కూడా పవన్ ప్రకటించారు. ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేనట్టే భావించాల్సి ఉంటుంది.ఏ మాత్రం అవకాశం దొరికినా జనసేన అధినేతపై విరుచుకుపడే వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు లేకుంటే, ఇక జనసేన అధినేతను తిట్టాల్సిన అవసరం లేదు. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించడం వల్ల కాపుల్లో వ్యతిరేకత వస్తోంది.

ఇప్పటికే చంద్రబాబునాయుడిని, వారి కుటుంబ సభ్యలపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా కమ్మ సామాజికవర్గం వైసీపీకి దూరమైంది.ఇక జనసేనానికి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే కాపు కులం కూడా దూరం జరిగే ప్రమాద ముందని వైసీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరాటం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో, ఇక ఆ పార్టీ నేతపై ఎలాంటి విమర్శలు చేయవద్దని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైసీపీ నేతలందరికీ సంకేతాలు అందాయని తెలుస్తోంది. అందుకే అందరూ ఒకేసారి కట్టకట్టుకుని నోటికి తాళం వేసుకున్నారు. జనసేనాని మళ్లీ టీడీపీతో పొత్తు మంతనాలు సాగిస్తే మరలా వైసీనీ నేతలు భూతులతో విరుచుకు పడే అవకాశం లేకపోలేదు.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh