JEE Advanced 2023 results : టాప్ 10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే.
JEE Advanced 2023 results : జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.
ఈ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రోడు వివిలాల చిద్విలాస్ రెడ్డి కామన్ ర్యాంకు జాబితాలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు.
ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన చిద్విలాస్ 360కి మార్కులకుగాను 341 మార్కులు సాధించాడు.
అలాగే, అమ్మాయిల్లో నాయకంటి నాగభవ్య శ్రీ 360 మార్కులకుగాను 289 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.
గత యేడాదితో పోల్చితే ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ప్రశ్నలు తక్కువగా ఉండటంతో పరీక్షల్లో ఎక్కువ కటాఫ్ మార్కులకు అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏలూరుకు చెందిన బిక్కిన అభినవ్ చౌదరి 360కి 325 మార్కులతో ఏఐఆర్ 7 సాధించాడు.
అడ్డగడ వెంకట శివరాం, నాగిరెడ్డి బాలజీరెడ్డి, యక్కంటి పాణి వెంకట మణిందర్ రెడ్డి వరుసగా ఐదు, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు.
అలాగే మూడు, నాలుగు ర్యాంకులను రూర్కీ జోన్ కు చెందిన రిషి కల్రా, రాఘవ్ గోయల్ దక్కించుకోగా, ఢిల్లీ జోన్ కు చెందిన ప్రభావ్ ఖండేల్వాల్ (ఏఐఆర్ 6), మలయ్ కేడియా (ఏఐఆర్ 8) ఈ జాబితాను పూర్తి చేశారు.
జాయింట్ సీట్ అలకేషన్ (జేఓఎస్ఏఏ) కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
టాప్ 55 ర్యాంకులన్నీ బాలురే కావడం గమనార్హం. నాయకంటి నాగ భవ్యశ్రీ మహిళా విభాగంలో టాప్ పెర్ఫార్మర్ గా నిలిచి ఏఐఆర్ 56 సాధించింది.
టాప్ 10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే.
జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకున్న చిద్విలాస్ రెడ్డి మాట్లాడుతూ, ” నాకు న హార్డ్ వర్క్ ఎంతగానో సహాయపడింది. ప్రాక్టీస్ పేపర్ల JEE Advanced 2023 results : రివిజన్, సాల్వింగ్ కోసం కూడా నిర్దిష్ట సమయాన్ని కేటాయించాను. వాటి ప్రాముఖ్యత మరియు అత్యవసరత ఆధారంగా పనులకు ప్రాధాన్యత ఇవ్వడం నాకు ఏకాగ్రతను కలిగి ఉండటానికి సహాయపడింది.”
ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ లో B. Tech పూర్తి చేసి, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇన్నోవేటర్, కంప్యూటర్ సైంటిస్ట్ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన తేజ హైదరాబాద్ వెళ్లి శ్రీచైతన్యలో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుకున్నారు.
భవిష్యత్ జేఈఈ ఆశావహులకు ఆయన సలహా ఇస్తూ, “నా స్వంత అనుభవం మరియు విజయం ఆధారంగా, అన్ని సబ్జెక్టుల్లో బలమైన భావన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టాలని నేను వారికి సలహా ఇస్తాను. కాబట్టి విద్యార్థులు నిలకడైన ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలి.
ఈ ఫలితాలపై తేజ సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘ఇది ఎంతో సంతోషం, గర్వం కలిగించే క్షణం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 12 గంటలు కేటాయించాను. నాకు అండగా నిలిచిన మా నాన్న రామస్వామి రమేష్, తల్లి ఎ.కృష్ణవేణి, అధ్యాపకులకు కృతజ్ఞతలు. ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈఓ JEE Advanced 2023 results : కావాలన్నది నా ఆకాంక్ష. తండ్రి నరసింగరాయనిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కాగా, తల్లి నెల్లూరులోని మహదేవమంగళం గ్రామంలో ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ కాగా,
అలాగే చిలకలూరిపేటకు చెందిన ఏవీ శివరాం, గుంటూరుకు చెందిన వైవీ మహేందర్ రెడ్డి గుంటూరులోని భాష్యం విద్యాసంస్థల్లో చదువుకున్నారు. శివరాం తండ్రి హనుమంతరావు రైతు కాగా, తల్లి కళావతి నరసరావుపేట మార్కెట్ యార్డులో సూపర్ వైజర్ గా పనిచేస్తోంది. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తల్లిదండ్రులు తనను చదువుకునేలా ప్రోత్సహించారని శివరాం సంతోషం వ్యక్తం చేశారు. వైవీ మహేందర్ రెడ్డి కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారే.
జూన్ 4న జరిగిన ప్రవేశ పరీక్షకు 1.8 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 43,773 మంది జేఈఈ అడ్వాన్స్ డ్ లో అర్హత సాధించారు. మొత్తం అర్హత సాధించిన అభ్యర్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30 వేల మంది ఉన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ కు రిజిస్టర్ చేసుకోవచ్చు.