IPL 2024: He beat the Aussies badly at the Gabba.. If cut.. Worst record in IPL debut
IPL 2024: Gabba hero flops in IPL debut
IPL 2024: గబ్బాలో ఆసీస్‌ను చిత్తుగా ఓడించాడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ అరంగేట్రంలో చెత్త రికార్డ్..IPL 2024: వెస్టిండీస్ పేసర్ జోసెఫ్ ఈ మ్యాచ్‌తో లక్నో తరపున IPL అరంగేట్రం చేశాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యతను యువ పేసర్‌కు అప్పగించాడు.
ఓవర్ బాగా ప్రారంభించిన షమర్ జోసెఫ్ ఆ తర్వాత పట్టాలు తప్పడంతో.. అరంగేట్రంలోనే తన ఖాతాలో చెత్త రికార్డ్‌ను వేసుకున్నాడు.
Shamar Joseph Creates Unwanted Record
Shamar Joseph Creates Unwanted Record: ఐపీఎల్ 2024 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్‌ను ఓడించి విజయపథంలోకి చేరుకుంది. లక్నో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి కేకేఆర్‌కు 162 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ లక్ష్యాన్ని ఛేదించిన KKR ఆరంభం నుంచి అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించడమే కాకుండా లక్నో జట్టును మ్యాచ్‌లో లేకుండా చేసింది.
లక్నో బౌలర్ షమర్ జోసెఫ్ వేసిన తొలి ఓవర్ కూడా లక్నో జట్టుకు భారీ నష్టాన్ని మిగిల్చింది.
నిజానికి వెస్టిండీస్ పేసర్ జోసెఫ్ ఈ మ్యాచ్‌తో లక్నో తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యతను యువ పేసర్‌కు అప్పగించాడు. ఓవర్ బాగా ప్రారంభించిన షమర్ జోసెఫ్ ఆ తర్వాత పట్టాలు తప్పాడు.
తొలి ఓవర్లోనే షమర్ జోసెఫ్ మొత్తం 22 పరుగులిచ్చి, తొలి ఓవర్లోనే జట్టును మ్యాచ్ నుంచి దూరం చేశాడు. అలాగే జోసెఫ్ ఐపీఎల్ అరంగేట్రం తొలి ఓవర్లోనే అత్యధిక పరుగులిచ్చిన చెత్త రికార్డును నెలకొల్పాడు.
షమర్ జోసెఫ్ తన ఓవర్ తొలి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. రెండో బంతికి లెగ్ బై. మూడో బంతికి బౌండరీ, నాలుగో బంతికి 2 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి కూడా 1 పరుగు బై వచ్చింది.
కానీ, జోసెఫ్‌కు ఆరో బంతి చెత్తగా మారింది. జోసెఫ్ చివరి బంతికి మొత్తం 14 పరుగులు ఇచ్చాడు.
జోసెఫ్ చివరి బంతికి 2 వైడ్లు, 2 నో బాల్స్, ఒక వైడ్ ఫోర్, ఒక సిక్సర్ ఇచ్చాడు.
నిజానికి లక్నో తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన జోసెఫ్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన గబ్బా టెస్టు ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయంలో జోసెఫ్ పాత్ర ఎంతో ఉంది.
ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జోసెఫ్ 12 ఓవర్లలో 7 వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్, ఆస్ట్రేలియాపై విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయంగా చరిత్ర సృష్టించింది. IPL 2024: Gabba hero flops in IPL debut
for more information click here