సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబిత. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ చెపట్టాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు కూడా సబిత ఆదేశించారు.
దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్‌తో పాటు మేనేజ్మెంట్పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో తమ కుమారుడికి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలంటూ శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని పేరెంట్స్ ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
సాత్విక్ మృతికి నిరసనగా విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘాలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మృతుడి తల్లిదండ్రులు కాలేజీ ముందే బైఠాయించి న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు.నార్సింగ్ కార్పొరేట్ కళాశాల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి :