టాస్ గెలిచిన టీమిండియా రాహుల్ స్థానం లో శుబ్ మన్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 లో భాగంగా జఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడో టెస్టులో నెగ్గినా లేదా డ్రా చేసుకున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరుతుంది. తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఆస్ట్రేలియా సిరీస్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ’డ్రా‘ చేసే అవకాశం మాత్రం ఉంది. అయితే వారి ఫామ్ ను చూస్తే ఇది కాస్త కష్టమనే చెప్పాలి. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిస్తే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో సగర్వంగా అడుగు పెట్టగలుగుతుంది. అయితే ఈ మ్యాచులో కూడా ఆస్ట్రేలియాను కంగారు పెట్టించాలని రోహిత్ సేన భావిస్తుంది.
కానీ టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కేఎల్ రాహుల్ స్థానంలో పరుగుల వీరుడు శుభ్ మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. అలాగే షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. వార్నర్, ప్యాట్ కమిన్స్ స్థానంలో స్టార్క్, గ్రీన్ జట్టులోకి వచ్చారు.
టీమిండియాలో కేఎల్ రాహుల్ పై ప్రస్తుతం పెద్ద డిబేట్ నడుస్తుంది. వరుసగా విఫలం అవుతున్న రాహుల్ ను పక్కనపెట్టి సూపర్ ఫామ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ కు చోటు దక్కడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడిన 3 ఇన్నింగ్స్ ల్లో రాహుల్ కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు ఈ ఏడాది సెంచరీల మీద సెంచరీలు చేసిన శుబ్ మన్ గిల్ మాత్రం బెంచ్ కే పరిమితం అయ్యాడు. తొలి రెండు టెస్టులకు టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ ను ఆ పదవి నుంచి తప్పించారు. దాంతో మూడో టెస్టులో రాహుల్ ను పక్కన పెట్టారు.
మరోవైపు గాయాలతో జోష్ హేజల్ వుడ్, డేవిడ్ వార్నర్ లు స్వదేశానికి వెళ్లిపోయారు. కుటుంబ సమస్యల కారణంగా కమిన్స్ కూడా స్వదేశానికి వెళ్లాడు. రఇక స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఆస్ట్రేలియా జట్టులో అయోమయపరిస్థితులు నెలకొని ఉన్నాయి అనే చెప్పాలి. ఇక మూడో టెస్టులో జట్టులో కమిన్స్ స్థానంలో మిచెల్ స్టార్క్, వార్నర్ స్థానంలో గ్రీన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇది కూడా చదవండి :