Hyderabad: పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు ఎప్పటి వరకు అంటే ?
Hyderabad: ముస్లిం సోదరులకు అతి పెద్ద పండగ రంజాన్ ఈ రోజు వారంత ఎంతో పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో అల్లాకి ప్రార్థనలు చేస్తారు. రంజాన్ పండగా చంద్రుడి గమనం ఆధారంగా ఈ పండగా సాగుతుంది. ఇదే క్రమంలో ముస్లిం పెద్దలు హజ్ యాత్ర కూడా చేస్తారు. సౌదీ అరేబియాలో ఏ రోజు నెలవంక కనిపిస్తుందో ఆ రోజు నుంచే పండగ ప్రారంభమవుతుంది.
ఇతర దేశాల్లో కంటే భారత దేశ వ్యాప్తంగా రంజాన్ పండగాను ముందుగానే జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలు భక్తులు రంజాన్ మాసం మొత్తం ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా ప్రార్థనలు కూడా చేస్తారు.
రంజాన్ రోజునే ‘ఖురాన్’ అవతరించింది. కాబట్టి ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మాసం మొత్తం ఉపవాసాలు, దీక్షలు కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో ఉండడం వల్ల అల్లా అనుగ్రహం లభిస్తుంది అని వారి నమ్మకం.
ఈ రంజాన్‌లో ఇఫ్తార్ విందులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ముస్లిం భక్తులంతా ఉపవాసాలు పాటించి తర్వాతి రోజున ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఈ విందు సూర్యాస్తమయం తర్వాత ముగిస్తుంది.
అయితే నేడు రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా Hyderabad పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గీ చౌక్, చార్మినార్ -రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య ప్రధాన రహదారుల్లో ఉదయం 9 గంటల నుంచి అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపిశారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. Hyderabad చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వివిధ పాయింట్ల వద్ద మళ్లిస్తున్నారు. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తున్నారు. అదే విధంగా హిమ్మత్‌పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతిగల్లి, ఈతేబార్ చౌక్, సెహర్-ఎ-బాటిల్ కమాన్, లక్కడ్ కోటే వద్ద ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.
మక్కా మసీదుకు వచ్చే వాహనాలకు ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా మక్కా మసీదు పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చే వారి సౌకర్యార్థం పార్కింగ్, ఇతర సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
అలాగే Hyderabad మక్కా మసీదుకు వచ్చే భక్తుల వాహనాలకు ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ఈ ఆంక్షలు, మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు వర్తిస్తాయని, సహాయ సహకారాలు అవసరమైన వాళ్లు 9010203626 నంబర్‌లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు.