ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్‌లోని మల్టీ ఫ్లెక్స్‌ల్లో షోగా వేయనున్నారు. వీటికి సంబంధించిన బుక్సింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌ను డైరెక్ట్‌గా ఎలాగో చూడలేరు, కనీసం థియేటర్లలో అయినా చూడాలని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలా అనుకునే వారికి ఇది బెస్ట్ ఆపర్చునిటి. హైదరాబాద్ వ్యాప్తంగా వున్న అన్ని మల్టీ ఫ్లెక్స్‌ల్లో షోష్ కి అంతా సిద్దంగా వుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది.
ఆ రోజున క్రికెట్ ప్రియులు అందరూ టీవీల ముందు అతుక్కుని కూర్చుకుంటారు. మరికొందరు పెద్ద స్క్రీన్ పెట్టుకుని మ్యాచ్‌ను ఆస్వాదిస్తారు. అయితే అందరికీ బిగ్ స్క్రీన్స్ వుండక పోవచ్చు, కానీ ఇలా మల్టీ ఫ్లెక్స్ తెరల పై క్రికెట్ చూస్తే ఆ థ్రిలే వేరు బ్రో అంటున్నారు. క్రికెట్ ప్రియులకు.. ఇక నగరంలోని మల్టీ ఫ్లెక్స్‌లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను బిగ్ స్క్రీన్స్ పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి… అయితే దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. మ్యాచ్‌ను థియేటర్‌లో చూడాలని అనుకునే వారు వెంటనే బుక్ టికెట్లు బుక్ చేసుకోండి. అయితే క్రికెట్ అభిమానుల కోసమే థియేటర్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.