భారీగా పతనం అయిన పసిడి ఈ రోజు రేట్లు ఇలా ..
గతేడాది దీపావళి సీజన్ నుంచి భారీగా బంగారం, వెండి ధరలు పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఫిబ్రవరిలో గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా తగ్గాయి. గత నెలలో చూస్తే బంగారం ధరలు ఆకాన్ని అంటుతాయి అనుకుంటే. కానీ 25 రోజులుగా గోల్డ్ రేట్ తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా భారీగా పడిపోతోంది. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్‌కు చేరుకోగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.51,000 మార్క్‌కు చేరువైంది.అలాగే గత మూడువారాలుగా గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.51,500 నుంచి రూ.51,350 ధరకు చేరుకుంది.మరొక వైపు స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్‌కు చేరువైంది. . హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.160 తగ్గడంతో రూ.56,180 నుంచి రూ.రూ.56,020 ధరకు చేరుకుంది. మరోవైపు వెండి ధర దారుణంగా పడిపోతోంది. కిలో వెండిపై రూ.1000 తగ్గడంతో రూ.69,000 ధరకు చేరుకుంది.
హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.160 తగ్గడంతో రూ.56,180 నుంచి రూ.రూ.56,020 ధరకు చేరుకుంది. మరోవైపు వెండి ధర దారుణంగా పడిపోతోంది. కిలో వెండిపై రూ.1000 తగ్గడంతో రూ.69,000 ధరకు చేరుకుంది. ఫిబ్రవరి 2న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.53,600 ఉండగా ప్రస్తుతం రూ.51,350 ధరకు దిగొచ్చింది. 25 రోజుల్లో ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రేట్ రూ.2,250 తగ్గింది. ఇక ఫిబ్రవరి 2న 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.58,470 ఉండగా ప్రస్తుతం రూ.రూ.56,020 ధరకు దిగొచ్చింది. 25 రోజుల్లో రూ.2,450 ధర తగ్గింది.
ఇక అదే రోజున కిలో వెండి ధర రూ.77,800 ఉండగా, ప్రస్తుత ధర రూ.69,000 . ఏకంగా రూ.8,800 ధర తగ్గింది. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ 2023 ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.11 శాతం అంటే రూ.61 రూ.55,371 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.88 శాతం అంటే రూ.558 తగ్గి రూ.62,875 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,810.90 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర కూడా పతనం అయింది.
ఇది కూడా చదవండి :