Glenn Maxwell : గుడ్​న్యూస్​ చెప్పిన మ్యాక్స్​వెల్​ జంట

Glenn Maxwell :

Glenn Maxwell : గుడ్​న్యూస్​ చెప్పిన మ్యాక్స్​వెల్​ జంట

Glenn Maxwell :ఆస్ట్రేలియా స్టార్​​ బ్యాటర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​, అతడి భార్య వినీ రామన్​ గుడ్​ న్యూస్​ చెప్పారు. ఐపిఎల్ 16వ సీజ‌న్‌(IPL 2023)లో దంచికొడుతున్న‌ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వ‌ర‌లోనే తాము త‌ల్లిదండ్రులం కాబోతున్న‌ట్టు వెల్ల‌డించాడు. గ‌ర్భ‌వ‌తి అయిన‌ అతడి భార్య వినీ రామ‌న్ త‌మ బేబీ ఆల్‌స్ట్రా సౌండ్ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మ్యాక్స్‌వెల్, నేను రెయిన్‌బో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నాం’ అని ఆమె తెలిపింది.

గత ఏడాది మార్చి 27న హిందు సాంప్రదాయంలో భారత సంతతికి చెందిన విని రామన్  తో మ్యాక్స్ వెల్ పెళ్లి  జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ మగబిడ్డ పుట్టబోతున్నట్లు విని వెల్లడించింది. ‘ఈ ఏడాది సెప్టెంబరులో మా కన్నుల పంట, రెయిన్‌బో బేబీ పుట్టబోతున్నట్లు ప్రకటించడనాకి గ్లెన్, నేను ఇద్దరం చాలా సంతోషిస్తున్నాం. ఈ జర్నీ అంత ఈజీగా, సాఫీగా సాగలేదే. ఆ విషయాన్ని గుర్తించడానికి కూడా ఈ క్షణం చాలా ముఖ్యం’ అని ఆమె చెప్పింది

అయితే ‘ఇలాంటి పోస్టులు చూసినప్పుడల్లా మా జీవితాల్లో ఎప్పుడు ఇలాంటి క్షణం వస్తుందా? అని ఆలోచిస్తూ బాధపడటం నాకు అనుభవమే’ అని చెప్పిన ఆమె.. పిల్లలు కనడానికి ఇబ్బందులు ఉన్న, అలాగే పుట్టక ముందే పిల్లలను కోల్పోయిన జంటలు అందరికీ తాము ప్రేమను పంపుతున్నట్లు కూడా విని పేర్కొంది. Glenn Maxwell :అలాగే తమకు అబ్బాయి పుడుతున్నట్లు ప్రకటించింది.

ఈ పోస్టులో  రామన్ ‘రెయిన్ బో బేబీ’ అని మెన్షన్ చేయడం అందరినీ ఆకర్షించింది.  రెయిన్ బో బేబీ అంటే అంతకుముందు  ఒక మహిళకు గర్భస్రావం   అయి ఉంటేనో లేక  ఏదైనా కారణం వల్ల   శిశువు తల్లి కడుపులోనే మరణిస్తే  వారి తర్వాత  పుట్టే బిడ్డను రెయిన్ బో బేబీ అని పిలుస్తారు.  అంటే దీని ప్రకారం  రామన్ ఇదివరకే  ప్రెగ్నెంట్ అయి ఉండి బహుశా ఏదైనా కారణాల వల్ల గర్భస్రావం అయి ఉంటుందనే తెలుస్తున్నది.

Glenn Maxwell :  ఈ విషయాన్ని అటు రామన్ గానీ   మ్యాక్స్‌వెల్ గానీ  సోషల్ మీడియాలో పోస్టులు చేయలేదు. అదీగాక గతేడాది మ్యాక్సీ కూడా  కాలుకు గాయంతో  చాలా కాలం పాటు బెడ్ కే పరిమితమై సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు.  కాగా ఈ రెయిన్ బో బేబే అంటే ఏమిటన్న విషయాన్ని కూడా విని రామనే తన  పోస్టులో కామెంట్స్ చేయడం గమనార్హం.

అయితే వినీ రామ‌న్  పోస్ట్ పై  మ్యాక్సీ టీంమేట్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో  లవ్ సింబల్ జతచేసి శుభాకాంక్షలు తెలియజేసింది.  అలాగే  ఆరోన్ ఫించ్ భార్య అమీ ఫించ్, ఉస్మాన్ ఖవాజా భార్య రచెల్ ఖవాజా శుభాకాంక్షలు  తెలిపారు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh