కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఒంగోలులో గురువారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో చిరంజీవి గారికి మంచ సంబందాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీజేపీ, వైసీపీ పాలనపై జనం విసిగిపోయారన్నారు. కాగా రాష్ట్రం లో ఏపీ ప్రభుత్వ పని తీరుపై గిడుగు అసహనం వ్యక్తం చేసారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. ఈ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేసేలా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: