Ganguly: గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ..

Ganguli

Ganguly: గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ.. అసలు కారణం అదే

Ganguly: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం గంగూలీకి బెంగాల్ ప్రభుత్వం y కేటగిరీ భద్రతను కల్పిస్తూ వచ్చింది.

అయితే మంగళవారంతో ఆయన వై కేటగిరీ సెక్యూరిటీ పదవి కాలం ముగిసిపోయింది. దీంతో సౌరవ్ గంగూలీకి Z కేటగిరీకి భద్రతను కల్పిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొత్త భద్రతా ఏర్పాట్ల ప్రకారం, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కింద గంగూలీ వెనుక ఎప్పుడూ 8 నుంచి 10 మంది పోలీసు అధికారులు రక్షణగా ఉంటారు.

ఇదే వై కేటగిరీ కింద గంగూలీకి ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు భద్రత కల్పించేవారు.

Also Watch

Lady Singham: రోడ్డు ప్రమాదంలో అస్సాం ‘లేడీ సింగం’ మృతి

మంగళవారం కోల్‌కతాలోని గంగూలీ బెహాలా ఆఫీసులో ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న విషయం తెలిసిందే.

మే 21న అతడు కోల్‌కతాకు తిరిగి రానున్నాడని, అప్పటి నుంచే అతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తామని ఆ అధికారి తెలిపారు.

వెస్ట్ బెంగాల్లో పలువురు మంత్రులకు ఉండే సెక్యూరిటీ ఇక నుంచి గంగూలీకి కూడా ఉండనుండటం విశేషం.

అక్కడి సీఎంతోపాటు గవర్నర్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా. పలువురు ఇతర మంత్రులకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది.

నేడు  ఢిల్లీ కేపిటల్స్-పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు ధర్మశాలలో ఏర్పాటైంది ఈ మ్యాచ్. ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ కేపిటల్స్ వైదొలగింది.

ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లల్లో గెలిచింది నాలుగంటే నాలుగే. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

చేతిలో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌తో పాటు చివరి లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.

పంజాబ్ కింగ్స్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో నెగ్గితే ప్లేఆఫ్స్ ఆశలను నిలుపుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి.

ఢిల్లీ కేపిటల్స్‌తో పాటు మరో మ్యాచ్ మిగిలేవుంది. ఈ రెండూ గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువ అవుతుంది. అందుకే ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది పంజాబ్ కింగ్స్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh