Former minister Harish Rao house arrest
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్. హరీష్రవును కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్న పోలీసులు.
బిఆర్ఎస్ MLC రాజు ఇంటి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఆర్కెపూడి గాంధీ ఇంటి వద్ద 11 గంటలకల్లా ర్యాలీ చేస్తామని సవాలు చేసిన తరుణంలో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసులు.
ఈ తరుణంలో ఆర్కేపూడి గాంధీ స్పందిస్తూ ప్రాంతీయ విభాగాలు కి దారితీస్తుందంటూ కెసిఆర్ స్పందించాలి అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్.
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్ల పర్వంతో హైటెన్షన్ పొలిటికల్
ఫైట్ నడుస్తోంది. అరికెపూడి గాంధీతోపాటు ఆయన అనుచురులు కౌశిక్‌రెడ్డి ఇంటికి భారీగా చేరుకోవడంతో రణరంగంగా మారింది. కౌశిక్‌రెడ్డి ఇంటిలోకి దూసుకెళ్లడంతో తీవ్ర
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ అనుచురులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక్కసారిగా కౌశిక్‌రెడ్డి ఇంటిలోకి దూసుకెళ్లిన అరికెపూడి గాంధీ అనుచరులు.. టమాటాలు, కోడిగుడ్లతో దాడికి చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర రెండు వర్గాల అనుచరుల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లు విసరడంతో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కూకట్‌పల్లి నుంచి కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. ఆయన అనుచరులు మాత్రం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడడంతో సెక్యూరిటీ గేట్ విరిపోయింది. కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఇంటి ముందు బైఠాయించారు అరికెపూడి గాంధీ. దమ్ముంటే ఇంటి నుంచి కౌశిక్‌రెడ్డి బయటికి రావాలని సవాల్ విసిరారు.
నా ఇంటికి రాలేకపోయావ్.. నేనే నీ ఇంటికొచ్చానన్నారు అరికెపూడి గాంధీ. బయటకు రాకుండా ఇంట్లో దాక్కున్నాడని.. కౌశిక్‌రెడ్డికి దమ్మూధైర్యం లేదని.. ఆయనో పిరికివాడని విమర్శించారు అరికెపూడి గాంధీ. అటు.. హైటెన్షన్ పొలిటికల్ ఫైట్‌తో అప్రమత్తమైన పోలీసులు.. గాంధీని, ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరికెపూడి గాంధీ, ఆయన అనుచరుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కౌశిక్‌రెడ్డి. తన ఇంటికి గాంధీని ఆహ్వానిస్తే.. ఆయుధాలతో ఇంటిపైకి దూసుకొచ్చారని మండిపడ్డారు. అరికెపూడి గాంధీ తన హత్యకు కుట్ర చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. అరికెపూడి గాంధీకి తానేంటో రేపు చూపిస్తానంటూ కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.
Former minister Harish Rao house arrest