పాదాలకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఎందుకు? వీటికి ఏం చేస్తే ఫలితం ఉంటుంది ?

చలికాలం వచ్చింది అంటే చాలు చర్మం పోడారిపోవడం, పగుళ్లు ఏర్పడటం మనం చూస్తూ ఉంటాం …. అందులోనూ కాళ్ళ పగుళ్లు మరింత బాధిస్తూ ఉంటాయి .. ఎందుకు అలా? మనం నేల మీద నిలబడటానికి , నడవడానికి సహకరించే మన పాదాలు ఎప్పుడూ మన బరువుని మోస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా వత్తిడికి గురవుతూ ఉంటాయి. పాదాలతో పాటు అర చేతులు కూడా రకరకాల పనులలో సహకరిస్తూ స్ట్రెస్ కి గురౌతూ ఉంటాయి. అందువల్ల పాదాల చర్మం (sole), అరచేయి చర్మం (palm) మందంగా ఉంటాయి. అంతేకాకుండా మందంగాను, దృఢమైన కండర పొరతోను ఉండడం వల్ల శరీర రక్త ప్రసరణ వ్యవస్థ అరికాళ్లు, అరచేతుల్లో చివరి వరకు ఉండదు. కొంత వరకు విస్తరించి ఆ తర్వాత ఆగిపోతుంది. అంటే నీటిని, పోషక విలువల్ని పంపిణీ చేసే రక్తనాళికలు.. అరికాలి చర్మంలో నేలను తాకే చిట్టచివరి పొర వరకు చేరవన్నమాట. నీరులేని పంట పొలాలు ఎలా అయితే బీటలు వారినట్టు అవుతాయో ..నీరు అంతగా లభించని అరికాలి చర్మం కూడా పగుళ్లకు లోనవుతుంది. ఈ పరిస్థితిని మనం చలికాలంలో ఎక్కువగా చూస్తాం . ఎందుకంటే చలికాలంలో చర్మంలో రక్తనాళాలు.. మరింత లోతుల్లో ఉంటాయి. చలికాలంలో చర్మం పాలిపోయినట్టు తెల్లగా ఉండడానికి కారణం కూడా అదే. ప్రతి పూట కాసేపు అరికాళ్లను బకెట్టులోని గోరు వెచ్చని నీటిలో నానబెట్టి కొంచెం కొబ్బరి నూనె వంటి లేపనాలు పూసుకుంటే అరికాలి పగుళ్లను చాలా మటుకు నివారించవచ్చు. అనవసరంగా సౌందర్య సాధనాలను ఎక్కువగా ఉపయోగించటం కూడా మంచిది కాదు …మరీ ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువసేవు నీటిలో కాళ్ళు నానకుండా చూసుకోవాలి …చలి గాలికి ఎక్కువగా ఎక్సపోజ్ అయినా ఇదే స్థితిని మనం గమనించవచ్చు …

Dimple Hayathi In Shankars Movie keerthi suresh