బీజేపీ కండువా కప్పుకొనున్న మాజీ సీఎం

Ex-CM to wear BJP scarf

 

Nallari Kiran Kumar Reddy: బీజేపీ కండువా కప్పుకొనున్న మాజీ సీఎo

ఆరునెలలుగా సంప్రదింపుల అనంతరం అమిత్ షాతో ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. బీజేపీ అధిష్టానంతో జరుపుతున్నచర్చలు సఫలం కావడంతో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్ళు  బీజేపీకి ఏపీలో ఒక పెద్దతలకాయ అది కూడా నేషనల్ ఫిగర్ కోసం ఎదురు చూస్తున్న కాషాయనేతలకు కిరణ్ రూపంలో కనిపించింది.

ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఇన్నాళ్లు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయకండువా కప్పుకోనున్నారు. తనకు, తన తండ్రికి రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీ చేతిని వీడి కాషాయకండువా కప్పుకోబోతున్నారు.

అలాగే తెలుగురాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి అమిత్ షా గత కొంతకాలంగా వ్యూహరచన చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగమే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లోకి ఎంట్రీ అని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం కాషాయంలోకి ఎంట్రీకి  నిర్ణయం తీసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో పని చేసి కిరణ్ కుమార్ రెడ్డిని ఆ స్థాయిలో గౌరవం, పదవి ఇచ్చి ఆయన సేవల్ని వినియోగించుకుంటామని బీజేపీ అధిష్టానం ఆయన్ను పార్టీ మారడానికి ఒప్పించింది.  ఏపీ,తెలంగాణ రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ఇన్నాళ్లు ముందుండి పార్టీని నడిపించే బలమైన నాయకుడిగా కోసం గాలిస్తోంది. అందులో భాగంగా భారీ వ్యూహంతోనే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది బీజేపీ.

ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజికవర్గంను పార్టీ వైపు మళ్లించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.  రాజకీయాల్లో కీలకంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పట్టుంది. అప్పటి కాంగ్రెస్ పార్టీలో చీఫ్ విప్ గా, అసెంబ్లీ స్పీకర్ గా, మూడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీపై అప్పట్లో పూర్తి స్థాయి పట్టు సాధించారు. రాష్ట్రవిభజన తర్వాత అనుకున్న వ్యూహాలు ఫలించక కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది రెడ్డి నేతలు ఆ పార్టీని వీడారు తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పట్టు అత్యధికం రెడ్డి సామాజికవర్గం నేతలే అటు ఏపీలో పార్టీలో ముఖ్యనేతలెవరూ లేకపోయినప్పటికీ వారంతా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు.ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల్లో చాలామంది నేతలు ఉన్నారు.

ఇటు తెలంగాణల,అటు ఏపీల్లో వివిధ పార్టీల్లో ఉన్న ఆ మాజీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డికి టచ్ లో ఉన్నారు.  రెండు రాష్ట్రాల్లో ఉన్న రెడ్డి నేతలందర్నీ ఒక తాటిమీదికి తెచ్చి కమలాన్ని మరింత బలోపేతం చేయాలనేది బీజేపీ వ్యూహం. రాజకీయాల్లో విలువలున్న వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరుంది. అప్పట్లో రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి పదవినే వదులుకోవడం ఆ తర్వాత ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఇతర నేతలని ఎక్కడా విమర్శించకపోవడం లాంటి అంశాలు ఆయనకు మరింత విలువని పెంచాయి.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో కిరణ్ కుమార్ రెడ్డి అంటే మంచి గౌరవం ఇస్తారు రాజకీయనాయకులు. అందుకే ఆయనకున్న క్రెడిబిలిటీని పార్టీకి ఉపయోగించుకోవాలని బీజేపీ బావిస్తోంది. అందులోనూ రాయలసీమ డిక్లరేషన్ విషయంలో ఎప్పటి నుంచో బీజేపీ ప్రకటిస్తూ వస్తోంది.

అందుకే రాయలసీమలో అంతమాత్రం బీజేపీకి పట్టుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ పట్టుని మరింత పెంచుకుని వాటిని ఓట్లు దిశగా మలుచుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ని వినియోగించనుంది బీజేపీ రాయలసీమ రెడ్డినేతలను పార్టీకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. .కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారా అనుకుంటున్న తరుణంలో ఇలా కాషాయంలోకి ఎంట్రీ ద్వారా మరో సంచలనానికి తెరతీశారు. బీజేపీలో ఆయన చేరడంతో ఆ పార్టికి నిజంగా ఎంత ఉపయోగం ఉంటుందో లేదో తెలీదు కానీ రాజకీయంగా మళ్లీ జనాల్లోకి వెళ్లడానికి కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం ఇది లాభమేనని చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh