JUNIOR NTR షాకింగ్ కథతో వస్తున్న ఎన్టీఆర్..

JUNIOR NTR షాకింగ్ కథతో వస్తున్న ఎన్టీఆర్..పురాణాల్ని టచ్ చేసిన కొరటాల..!

Ntr 30: RRR తర్వాత ఎన్టీఆర్ తన కొత్త సినిమా కొరటాల శివతో చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి హిట్ కాంబో రిపీట్ కావడంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్రలో ఒదిగిపోయి.. తన నటనతో మైమరిపించారు.

ఈ సినిమా ఇండియాలోనే కాకుండా నెట్‌ఫ్లిక్స్ పుణ్యమా అని.. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్‌లో గుర్తింపును తెచ్చుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు.ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇంకా తన సినిమాను మొదలు పెట్టలేదు. కొరటాల డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. దీనికి రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నారు.

 

 

ఈ నేపథ్యంలోనే అందుకు ముందు అనుకున్నకథను పక్కకు పెట్టి.. పూర్తిగా కొత్త కథతో ముందుకుపోతున్నారట. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌కు కాస్తా ఆలస్యం అవుతోందని అంటున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమా నవంబర్ నుంచి షూట్ ఉండోచ్చని అంటున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట.తాజాగా ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా కథ పై మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా కథాంశం గరుడ పురాణం లోని ఓ అంశం చుట్టూ సాగుతుందట. హిందూ మతంలోని 18 మహా పురాణ గ్రంథాల్లో గరుడ పురాణం కూడా ఒకటి.

ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. అయితే అలాంటి గరుడ పురాణంను కొరటాల ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇది వైష్ణవ సాహిత్య కార్పస్‌లో ఒక భాగం. మరి కొరటాల గరుడ పురాణంలో ఏ పాయింట్ ను తీసుకుని కథ రాసుకున్నాడో చూడాలి.

కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ అప్ డేట్‌తో ఎన్టీఆర్ కొరటాల సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి,ఎన్టీఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కథల పట్ల, సన్ని వేశాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే పక్కాగా అన్ని కుదిరాకే సెట్స్ పైకి వెళ్లాలనీ భావిస్తోందట టీమ్.. ఇక ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది.

జక్కన్న – మహేష్ నుంచి క్రేజీ అప్ డేట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ‘RRR‘ వంటి క్రేజీ పాన్ ఇండియా మూవీని అందించిన గ్లోబల్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న జక్కన్న త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ ఈ మూవీని నిర్మించబోతున్నారు.

యాక్షన్ అడ్వెంచర్ గా అత్యంత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరపైకి రాబోతోంది.ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టిన జక్కన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. మహేష్ బాబు కెరీర్ లోనే ఊహించని బడ్జెట్ తో ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్యెంచరస్ మూవీగా రూపొందించనున్న ఈ మూవీని యదార్ధ సంఘటనల సమాహారంగా తెరపైకి తీసుకురానున్నారట.ఈ విషయాన్ని ఇటీవల పలు సందర్భాల్లో దర్శకుడు రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా యమ స్పీడుతో మొదలు పెట్టారట జక్కన్న.ఇప్పటికే ఇంటర్నేషనల్ స్టూడియోతో ఈ మూవీ కోసం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాజమౌళి ఈ ప్రాజెక్ట్ పై మరింత హాట్ టాపిక్ గా నిలపడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.ఇందులో భాగంగానే ఈ మూవీలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునేని సంప్రదిస్తున్నారట. ఇప్పటికే తనకు లైన్ వినిపించిన రాజమౌళి తనతో చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం దీపికా పదుకోన్ తెలుగులో ప్రభాస్ తో నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత దీపిక .. రాజమౌళి – మహేష్ ల ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.

ప్రస్తుతం ‘RRR’ ని జపాన్ లో ప్రమోట్ చేయబోతున్న రాజమౌళి ఆ తరువాత నుంచి మహేష్ బాబు ప్రాజెక్ట్ పైనే దృస్టి పెట్టనున్నాడట. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక ట్రీట్మెంట్ కోసం స్పెయిన్ వెళ్లిన మహేష్ తిరిగి నవంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడట.

బాలయ్య పెద్దమన‌సు… అర‌వింద్ పెద్ద ఆలోచన.

అల్లు అర‌వింద్ ఆధ్వ‌ర్యంలో మొద‌లైన అచ్చ తెలుగు ఓటీటీకి వ‌చ్చిన ఆద‌ర‌ణ‌ను అన్‌స్టాప‌బుల్ షోకు ముందు, త‌ర్వాత అని విభ‌జించి చూడొచ్చు. కేవ‌లం ఈ షో చూసేందుకు ఆహా స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్న వాళ్లు ల‌క్ష‌ల‌మంది ఉన్నారు. అందులో మెజారిటీ బాల‌య్య అభిమానులే అయినా.. న్యూట్ర‌ల్ ఆడియ‌న్స్ దృష్టిని కూడా ఆ షో బాగా ఆక‌ర్షించింది.

వేదిక‌ల మీద‌, బ‌య‌ట మాట్లాడేట‌పుడు కొంచెం త‌డ‌బ‌డే బాల‌య్య‌తో టాక్ షో ఏంటి అన్న వాళ్లంతా.. ఈ షో చూసి ముక్కున వేలేసుకున్నారు. చ‌క్క‌టి వాక్చాతుర్యంతో, హాస్య చ‌తుర‌త‌తో, త‌న‌కే సొంత‌మైన ఒక ప్ర‌త్యేక‌మైన యాటిట్యూడ్‌తో బాల‌య్య ఈ షోను న‌డిపించిన తీరుకు ఆయ‌న అభిమానులు కాని వాళ్లు కూడా ఫిదా అయిపోయారు.ఈ షో వ‌ల్లే ఆహా నిల‌బ‌డుతోంది, ఎదుగుతోంది అంటే అతిశ‌యోక్తి ఏమీ లేదు.రెండో సీజ‌న్‌ను నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా ఒక బ్యాంగ్ బ్యాంగ్ ఎపిసోడ్‌తో మొద‌లుపెట్టిన బాల‌య్య‌..

ఈ షోను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లేలా క‌నిపిస్తున్నాడు. ఈ ఎపిసోడ్‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ‌, ఆహాకు మ‌రింత పెరిగిన స‌బ్‌స్క్రిప్ష‌న్లు చూసి ఈ ఓటీటీ అధినేత అల్లు అర‌వింద్ చాలా సంతోషంగా ఉన్నార‌ట‌.ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య‌కు ఇంత‌కుముందు అనుకున్న దానికంటే ఎక్కువ పారితోష‌కం ఇవ్వాల‌ని భావించార‌ట‌. ఇదే మాట బాల‌య్య ద‌గ్గ‌ర చెబితే.. ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. త‌న‌కు అధిక పారితోష‌కం వ‌ద్ద‌ని, అది నా విలువలకు విరుద్ధం అని చెప్పేశారట. అయితే, అల్లు అరవింద్… దీనిపై కాస్త మదనపడ్డారట. అదే సమయంలో బాలయ్య పెద్ద మనసు అల్లు అరవింద్ ను ఆకట్టుకుందట.తనకు వచ్చే డబ్బునే బాలయ్య వద్దంటే ఆ డబ్బు మన వద్ద ఉంచుకోవడం తన మనసుకు మంచిగా అనిపించలేదట.

అందుకే తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడని ఇండస్ట్రీలో పేరు అల్లు అరవింద్.. అనూహ్యమైన డెసిషన్ తీసుకున్నారట. బాలయ్యకు ఎంతయితే రెమ్యునరేషన్ పెంచాలి అనుకున్నారో ఆ మొత్తాన్ని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రికి విరాళంగా ఇవ్వాల‌ని నిర్ణయం తీసుకున్నారట.ఈ విషయం త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఏదేమైనా బాల‌య్యదే షాకింగ్ డిసెషన్ అంటే… అల్లు అరవింద్ అంత కంటే తెలివైన మంచి నిర్ణయం తీసుకున్నారే… ఇద్దరూ ఇద్దరే అని ఆహా ఆఫీస్ లా టాక్ అంట. ఈ చ‌ర్య‌తో బాల‌య్య‌, అర‌వింద్ ఇద్ద‌రూ జ‌నాల మ‌న‌సులు గెల‌వ‌బోతున్నార‌న‌డంలో సందేహం లేదు.

Leave a Reply