ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఎంఎస్ ధోనీ రూ.60 కోట్లు విరాళం ఇచ్చాడా!

ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, క్రీడాకారులు రైలు ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒడిశా రైలు ప్రమాద ఒడిశా రైలు ప్రమాద బాధితుల‌కు ధోని రూ.60 కోట్లు డొనేట్ చేసిన‌ట్లు ప్రసార మాధ్యమాల్లో ఫార్వ‌ర్డ్ అవుతోన్న మెసేజ్ బోగస్ అని విచారణలో తేలింది. బాధితుల‌కు ధోనీ ఎటువంటి విరాళం ఇవ్వ‌లేద‌ని వెల్లడైంది.

అయితే ఇప్పటివరకూ ఈ ప్రమాద ఘటనపై ధోని స్పందించిన దాఖలాలు కూడా లేవు. అలాగే, విరాట్ కోహ్లీ 30 కోట్లు డొనేట్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్త‌ల్లోనూ వాస్తవం లేద‌ని ఒడిశా పోలీసులు తెలిపారు. ఫేక్ ట్వీట్ల‌తో రైలు ప్ర‌మాద ఘ‌ట‌న ప‌ట్ల మ‌తం కోణాన్ని చుప్పించాలని చూస్తున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఫేక్ మెసేజ్‌ల‌ను ఎవ‌రూ ఫార్వ‌ర్డ్ చేయ‌వ‌ద్దని పోలీసులు తెలిపారు.

అలాగే ఒడిశా రైలు ప్రమాద బాధితులకు చాహల్ లక్ష విరాళం స్కౌట్ అనే గేమింగ్ ఛానల్ కోసం భారత స్టార్ పేసర్ కూడా ముందుకు వచ్చి లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చాడు.

చాహల్ మాత్రమే కాదు, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని ముఖ్యమైన సహకారం అందించాడు. ఈ ఘోర ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తన బోర్డింగ్ స్కూల్ లో విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.

‘ఈ విషాద సమయంలో నేను చేయగలిగింది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల చదువుల బాగోగులు చూసుకోవడం. అలాంటి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీలో ఉచిత విద్యను అందిస్తాను’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ట్వీట్ చేశాడు.

సహాయక చర్యల్లో ముందుండి పోరాడుతున్న ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు, స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న వైద్య బృందం, వాలంటీర్లకు సెల్యూట్ చేస్తున్నాను. ఈ విషయంలో మేమిద్దరం కలిసే ఉన్నాం’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh