నందమూరి కుటంబానికి సినీ రాజికీయ ప్రముఖుల ప్రగాఢ సానుభూతి
జనవరి 27న నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. అయితే రెండ్రోజులుగా ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు తుదిశ్వాస విడిచారు.
నందమూరి తారకరత్న మరణవార్త తెలుగురాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న మృతదేహాన్ని బెంగళురు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించనున్నారు. మరి కొద్దిసేపట్లో మోకిల లోని ది కంట్రీ సైడ్ విల్లా కు చేరుకొనున్న తారక రత్న మృతదేహం.నందమూరి తారకరత్న భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది. బెంగళూరు నుంచి గత రాత్రి అంబులెన్స్‌లో బయలుదేరిన ఆయన భౌతికకాయం రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి చేరుకుంది. తారకరత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఆయన సందర్శించ డానికి వస్తున్న వారికి అన్నీ ఏర్పాట్లు కుటుంబ సభ్యులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తు శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న సిని రాజికియ ప్రముఖులు.
ఇది కూడా చదవండి;