రాహుల్‌ను టార్గెట్ చేయవద్దు
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో అతన్నే ఆడించాలని భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. రాహుల్ చాలా విలువైన ఆటగాడని చోప్రా తెలిపాడు. మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి రాహుల్‌ను ఆడిస్తుండటంతో టీం మేనేజ్మెంట్పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికితోడు తొలి టెస్టులో రాహుల్ విఫలమయ్యాడు. దీంతో విమర్శలు మరింత పెరిగాయి.
మరో ఆటగాడు బెంచ్‌కే పరిమితం అవడం వల్ల ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్ చెడ్డవాడు అవ్వకూడదని చోప్రా అన్నాడు. ‘గిల్‌ను పక్కన పెట్టారని నాక్కూడా తెలుసు. కానీ ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాడు చెడ్డవాడేం కాదు’ అని చెప్పాడు. అలాగే తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న ఛటేశ్వర్ పుజారా. ఈ మ్యాచులో అయినా అద్భుతంగా రాణించాలని కోరుకున్నాడు. తొలి టెస్టులో పుజారా కూడా విఫలమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే రెండో టెస్టు కోసం టీమిండియాలో ఒకే ఒక్క మార్పు చేయాలని చోప్రా స్పష్టం చేశాడు. భారత బ్యాటింగ్‌లో మరీ ఎక్కువ మార్పులు జరిగే అవకాశం లేదు. సూర్యకుమార్ స్థానంలో మళ్లీ శ్రేయాస్ అయ్యర్ ఆడతాడంతే. అంతకుమించి మార్పులు ఏవీ ఉండవు. కేఎల్ రాహుల్‌పై కొంత ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. కానీ అతను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడతాడని ఆశిస్తున్నా.
అతను చాలా బాగా ఆడగలడు. కానీ అనవసరంగా అతన్ని టార్గెట్ చేస్తున్నారు’ అని తెలిపాడు. అలాగే బౌలింగ్ విభాగంలో కూడా దాదాపు ఎలాంటి మార్పులూ ఉండవని చెప్పాడు. ఉమేష్ యాదవ్‌కు చోటు దక్కదని, కుల్దీప్ యాదవ్ కూడా దాదాపు వెయిట్ చేయక తప్పదని తేల్చేశాడు. అక్షర్‌ను పక్కన పెట్టి కుల్దీప్ను ఆడించడం ప్రస్తుతం సాధ్యమయ్యేలా లేదన్నాడు.
ఇది కూడా చదవండి :