CM Jagan: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సీఎం

CM Jagan

CM Jagan: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సీఎం

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతకు అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇటీవలే విద్యార్థుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం జగన్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు.

పేద విద్యార్థుల చదువులకు ఆటకం కలుగకుండా జగన్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తుంది. అలానే పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాల రూపు రేఖాలను వైసీపీ ప్రభుత్వం మార్చేసింది. పిల్లల చదువులు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని.. స్కూల్ కి వెళ్లేందుకు అవసరమైన ప్రతిదీ జగన్ ప్రభుత్వం అందిస్తుంది. మీ పిల్లల బాధ్యత నాదే అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల విద్యార్థులకు ఏటా విద్యా కానుకు అంద జేస్తున్నారు. ఈ ఏడాది స్కూళ్లు ప్రారంభమైన తొలి రోజే విద్యాకానుక అందించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Watch

JEE Main 2023 Results: సత్తా చాటిన హైదరాబాద్ విద్యార్థి

ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా స్కూళ్లు జూన్‌ 12న తిరిగి తెరుస్తారు.. అయితే, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు CM Jagan.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్ళల్లో నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయన్నారు. తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లు ఉన్నాయని తెలిపిన ఆయన తదుపరి ఖర్చుల కోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఐఎఫ్‌పీ పానెళ్లు బిగించడం పూర్తి కావడంతో 15వేలకు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయినట్టే అని వెల్లడించారు.

ఇక, పాఠశాలల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్‌ జూన్‌ 12 లోగా ఈ ఐఎఫ్‌ఎప్‌ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేసిన ఆయన గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబ్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్‌ డేగా పరిగణించాలని సూచించారు. ఇక స్కూళ్లు జూన్‌ 12న తిరిగి తెరుస్తారు. దీంతో అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేసి.. విద్యార్థులందరికీ శుభవార్త చెప్పారు. మొదటి రోజే విద్యా కానుక అందిస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవని భావిస్తున్నారు.

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh