Chandrababu Delhi Tour : నేడు హస్తినకు చంద్రబాబు

Chandrababu Delhi Tour

Chandrababu Delhi Tour : నేడు హస్తినకు చంద్రబాబు

Chandrababu Delhi Tour :  ఏపీలో  వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి.

అయితే ఏపీ సీఎం జగన్  ముందస్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.

వైసీపీ పాలన, నేతలపై బీజేపీ నేతల విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్తున్నారు.

అయితే  శనివారం ఉదయం వరకూ ఆయన ఢిల్లీ పర్యటన గురించి సీక్రెట్ గానే ఉంది.

శనివారం సాయంత్రం అమిత్ షాతో ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు ఏమీ అధికారంలో లేరు కాబట్టి వారితో ఎలాంటి అధికారిక విషయాలు చర్చించే అవకాశం లేదు.

కేవలం రాజకీయ అంశాలపై మాత్రమే చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే  చంద్రబాబు తిరిగి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒకసారి ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు.

. జీ-20 సన్నాహక సదస్సుకు హాజరైనప్పుడు మరోసారి కలిశారు. ఇప్పుడు మరోసారి కలవనున్నారు.

ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వతా  టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని తానే ఎన్డీఏలో చేరుతానని సీఎం జగన్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోం అయితే అనూహ్యంగా చంద్రబాబు  మోదీ, షాలతో భేటీకి ఢిల్లీకి వెళ్లడంతో రాజకీయంగా కీలక పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా అన్న చర్చ జరుగుతోంది.

ఇటీవల పలు సందర్భాల్ల మోదీ విధానాలను తాను సమర్థిస్తానని . ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు.

ఏపీలో వైసీపీ విముక్త పాలన కోసం.. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలసి వస్తుందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అయితే  బీజేపీ వైపు నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందనా లేదు.

అయితే ఇప్పుడు చంద్రబాబు  అమిత్ షా, మోదీలతో సమావేశానికి వెళ్లడంతోఈ పొత్తుల అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మారుతున్న జాతీయ రాజకీయాల కారణంగా చంద్రబాబు అనుభవాన్ని ఉపయోగించుకోవాలని మోదీ, అమిత్ షా కూడా భావిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో పూర్తిగా సహకరించే ప్రభుత్వం ఉండటంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది  చంద్రబాబు ఈ టూర్  ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh