చంద్రబాబును పోలవరానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు-అక్కడే ధర్నా.

APలో TDP అధినేత.. చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ఇవాళ ఉద్రిక్తంగా మారింది. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. తర్వాత జంగారెడ్డి గూడెం మీదుగా పోలవరం వెళ్లారు. అయితే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. జంగారెడ్డి గూడెం నుంచి పోలవరం గ్రామానికి చేరుకున్న చంద్రబాబు అక్కడే రోడ్ షో ఏర్పాటు చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లేందుకు బయలుదేరారు చంద్రబాబు …కానీ పెర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు అక్కడ ఏర్పడ్డాయి. పోలీసులతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు…దీంతో పోలవరం గ్రామం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డుపై చేరుకున్న చంద్రబాబు అక్కడే బైఠాయించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తనను పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటి అని పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. కానీ పోలీసులు మాత్రం వెనక్కితగ్గలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చంద్రబాబును వెళ్లనిచ్చేది లేదని భీష్మించారు. దీంతో టీడీపీ నేతలు నినాదాలు చేస్తూ చంద్రబాబుతో కలిసి బైఠాయించారు. దీంతో పోలవరం ప్రాజెక్ట్ కు వెళ్లే దారి మొత్తం టీడీపీ కార్యకర్తల హంగామా ,హడావుడితో నిండిపోయింది.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh