Chalaki Chanti: జబర్దస్త్ చలాకి చంటీ ఏమైంది ?
Chalaki Chanti: జబర్దస్త్ షోలో కామెడీ చేసి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు చలాకీ చంటి. బుల్లితెరపై మాత్రమే కాకుండా అటు వెండితెరపై కూడా మంచి పాత్రల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
అయితే చాలా కాలంగా తెరపై పెద్దగా కనిపించడంలేదు Chalaki Chanti. జబర్థస్త్ ను వదిలిపెట్టి బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళిన చంటీ ఆతరువాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత పెద్దగా కనిపించడంలేదు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ రోజు చలాకి చంటి గుండె పోటుకు గురియ్యానట్టు సమాచారం. ప్రస్తుతం చంటికి డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంటి ఆరోగ్యం పై ఇంకా కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం చంటి ఐసీయూ లో చికిత్స అందుకుంటున్నట్లు సమాచారం. జబర్దస్త్ లోనే మరి కొంతమంది ప్రముఖ కమెడియన్స్ కూడా చంటి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు అతని సన్నిహితులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాని తీవ్రత ఎంతో ఉంది అనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు..
మొదట కొన్ని చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన చంటి రేడియో జాకీగా కూడా కొంతకాలం పాటు కొనసాగాడు. ముఖ్యంగా నవ్వుల డాన్ అనే కామెడీ అతనికి రేడియో ప్రపంచంలో మంచి గుర్తింపు అయితే లభించింది. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యేవిధంగా చంటి కి అవకాశాలు కూడా వచ్చాయి. ఇక బిగ్ బాస్ 6 వ సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే
భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి పాపులారిటీ సంపాందించిన చంటి ఆ తర్వాతి కాలంలో కూడా పలు సినిమాల్లో నటించాడు. ఆపై జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా చాలాకాలం పాటు రాణించాడు. అక్కడైన తనదైన కామెడీ టైమింగ్, పంచ్‌లతో అలరించాడు. జబర్ధస్త్ షో చేస్తూనే సినిమాల్లో కూడా నటించాడు. ఈటీవీ ప్లస్‌లో నా షో నా ఇష్టం షోకు హోస్ట్‌గా చేశాడు. ఈ కార్యక్రమం చాలాకాలం కొనసాగింది. చంటికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇక చంటి త్వరగా కోలుకుని మళ్లీ అందరికీ క్లారిటీ ఇవ్వాలి అని సోషల్ మీడియాలో కూడా ఓ వర్గం వారు రియాక్ట్ అవుతున్నారు.