CCL 2023: సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్
దేశంలోనే అతిపెద్ద స్పోర్టైన్‌మెంట్ ఈవెంట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) సందడి మళ్ళీ మొదలైoది. ఈ రెండింటి యొక్క ప్రత్యేక కలయిక సెలబ్రిటీ క్రికెట్ లీగ్. మన దేశంలో ఎంటర్‌టైన్మెంట్‌కు రెండు ప్రధాన వనరులైన స్పోర్ట్స్, మూవీ ఈ రెండింటి యొక్క ప్రత్యేక కలయిక సెలబ్రిటీ క్రికెట్ లీగ్. ఈ సారి పాన్ ఇండియా రేంజ్‌లో 8 వివిధ ప్రాంతాల నుండి జట్లు పోటీపడ్డాయి. రాయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్‌పూర్, త్రివేండ్రం, జైపూర్ సహా ఆరు నగరాలు 19 గేమ్‌లకు ఆతిథ్యం ఇచ్చాయి .
అలాగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్(2023) మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. ప్రతిష్టాత్మక CCL కప్ జట్ల సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా, రితేష్ దేశ్‌ముఖ్ కెప్టెన్‌గా ముంబై హీరోస్ ఆర్య కెప్టెన్‌గా చెన్నై రైనోస్, వెంకటేష్ కో ఓనర్ అఖిల్ కెప్టెన్‌గా తెలుగు వారియర్స్, మనోజ్ తివారీ కెప్టెన్‌గా భోజ్‌పురి దబాంగ్స్, మోహన్ లాల్ కో ఓనర్ గా కుంచాకో బోపన్ కెప్టెన్‌గా కేరళ స్ట్రైకర్స్, బోనీ కపూర్ కో ఓనర్‌గా జిసుసేన్ గుప్తా కెప్టన్‌గా బెంగాల్ టైగర్స్, సుదీప్ కెప్టెన్‌గా కర్ణాటక బుల్డోజర్స్, సోనూసూద్ కెప్టెన్‌గా పంజాబ్ దే షేర్ పోటీ పడ్డాయి. అయితే లీగ్‌లో 120 మందికి పైగా సినీ ప్రముఖులు పాల్గొంటున్నందున ఈ సీజన్ ప్రేక్షకులలో చాలా ఉత్సాహo నింపారు .
అయితే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2023- లీగ్ దశల్లో 4 అగ్రశ్రేణి జట్లు సెమీ-ఫైనల్ దశలోకి ప్రవేశించాయి. భారతదేశంలోని ప్రాంతీయ సినీ పరిశ్రమల నుంచి నటీనటులను ఒకచోట చేర్చిన స్పోర్టైన్‌మెంట్ లీగ్‌గా పేరుగాంచిన సంగతి తెలిసిందే.
ఈ వారాంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2023 సెమీ-ఫైనల్ దశలోకి ప్రవేశించింది. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే మ్యాచ్‌తో ఈ ఏడాది సీసీఎల్ విజయవంతంగా ముగియనుంది.
కర్ణాటక బుల్డోజర్స్, భోజ్‌పురి దబాంగ్స్ 2023 CCL ఎడిషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించాయి. ఈ జట్లు ఇప్పటివరకు ఆడిన 16 మ్యాచ్‌లలో ఒక్క పరాజయాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్ కూడా బలమైన పోటీదారులుగానే నిలిచాయి. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాలను కలిగి ఉన్నాయి.
తొలి సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 24న వైజాగ్‌లో భోజ్‌పురి దబాంగ్స్, ముంబై హీరోస్ మధ్య జరగనుండగా, రెండో సెమీఫైనల్ కర్ణాటక బుల్డోజర్స్, తెలుగు వారియర్స్ మధ్య జరుగుతుంది. గ్రాండ్ ఫినాలే మ్యాచ్ మార్చి 25న వైజాగ్‌లో జరగనుంది.
CCL 2023 సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్
- మార్చి 24: భోజ్‌పురి దబాంగ్స్ vs ముంబై హీరోస్ – సెమీఫైనల్ 1 – 2:30 PM IST, వైజాగ్
- మార్చి 24: కర్ణాటక బుల్డోజర్స్ vs తెలుగు వారియర్స్- సెమీఫైనల్ 2 – 7:00 PM IST, వైజాగ్
- ఫైనల్: మార్చి 25 శనివారం: సాయంత్రం 7 నుంచి 11 గంటల వరకు, వైజాగ్
- సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రసార హక్కులను జీ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసింది. 9 వేర్వేరు భాషల్లో CCL 2023 సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అలాగే Zee5 యాప్ 2023లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది.