MP Avinash: ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ షాక్
MP Avinash: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నకడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులు నోటీసులు పంపారు.
ఇక, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు విచారణలకు అవినాష్ రెడ్డి దూరంగా ఉన్నారు.
ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కానీ, తనకు ముందుకు నిర్ణయించిన కార్యక్రమాలతో హాజరు కాలేనని ఎంపీ చెప్పారు. దీంతో 19న విచారణకు రావాలంటూ మరోసారి సూచించింది.
అయితే వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు విచారణకు నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి, రెండు సార్లు హాజరు కాలేదు. అయితే శుక్రవారం కూడా సీబీఐ విచారణకు హాజరుకాలేదు.
Also Watch
Mallikarjun Kharge: మోదీపై విరుచుకుపడ్డా మల్లికార్జున్ ఖర్గే
తన తల్లి లక్ష్మమ్మకు అనారోగ్యం కారణంతో విచారణకు హాజరుకాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం అందజేశారు.
హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డి లాయర్లు. ఆయన తరఫున లేఖను సమర్పించారు.
ఆ సమయంలోనే అవినాష్ రెడ్డి పులివెందుల వైపు పయనమయ్యారు. మరోవైపు అవినాష్ రెడ్డిని అస్వస్థతకు గురయ్యారని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టుగా సమాచారం.
అయితే తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో, అవినాష్ రెడ్డి తన కాన్వాయ్‌ను వెనక్కి తిప్పారు.
అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది.
వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం అవినాష్ కూడా కర్నూలులోనే ఉన్నారు. అవినాష్ రెడ్డి దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. దీంతో, ఇప్పుడు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 22న హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో విచారణకు రావాలంటూ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ నెలాఖరులోగా సీబీఐ వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంది.
ఇదే సమయంలో అవినాష్ దాదాపు గత నెల రోజులుగా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు.
కొ ర్టులకు వేసవి సెలవులు కావటంతో వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించారు.
ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది.
దీంతో సీబీఐ తాజా నోటీసుల పైన అటు న్యాయపరంగా అవినాశ్ తీసుకొనే నిర్ణయాలు ఇటు విచారణకు సంబంధించి ఏం చేస్తారు..
విచారణకు వస్తే జరిగే పరిణామాలు ఏంటనే ఉత్కంఠ కొనసాగుతోంది.