BRS: హైదరాబాద్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
BRS: హైదరాబాద్ నగరంలో మరో అత్యాధునిక వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. బేగంపేట ధనియాల గుట్టలోని శ్యామ్‌లాల్ బిల్డింగ్ వద్ద 4 ఎకరాల్లో రూ. 8.54 కోట్లతో ఈ ‘మహాపరినిర్వాణ’ను నిర్మించారు. అంతిమ సంస్కారాలకు అవసరమయ్యే వసతుల కల్పనతో పాటు పార్కింగ్, వైఫై, రెండు అంతిమ యాత్ర వాహనాలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ మోడ్రన్ వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ నేడు(మంగళవారం) లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వనగరంలోనూ సమస్యలు తప్పవని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వుండే సమస్యలు అక్కడా వుంటాయని.. భూమ్మీద మనిషి వున్నంతకాలం కూడా సమస్యలు వుంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అలాగే ప్రస్తుతం హైదరాబాద్ న్యూయార్క్‌ను తలపించేలా వుందని సూపర్‌స్టార్ రజనీకాంత్, హీరోయిన్ లయ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భగా ప్రస్తావించారు. ఏ నగరమైనా విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఫ్లై ఓవర్లు, మెరుగైన రవాణా వ్యవస్థ , మంచినీటి సరఫరా, 24 గంటల కరెంట్ తప్పనిసరని మంత్రి పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అద్భుతంగా మారిందన్నారు.
Also Watch
ఇక ఇటీవల హైదరాబాద్ నగరాన్ని ఉద్దేశించి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు గుప్పించారు అని హైదరాబాద్ కు వెళితే..ఇండియాలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా అన్నట్టుగా ఉంటుందని రజనీకాంత్ చెప్పారని పేర్కొన్నారు.
సినీ నటి లయ సైతం హైదరాబాద్ ను ఉద్దేశించి హైదరాబాద్ లో ఉంటే లాస్ఏంజిల్స్ లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదంతా అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ కృషి వల్లే జరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పామని, సమస్యలు లేవని కాదు అని పేర్కొన్నారు కేటీఆర్ .
జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం కంటే అద్భుతంగా ధనియాలగుట్టలోని వైకుంఠధామాన్ని నిర్మించామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు.
MA&UD Minister @KTRBRS is set to inaugurate Mahaparinirvana (Vaikunta Dhaamam) in Begumpet, spread over 4 acres.
Multiple facilities were provided in the modern funeral home to ensure grieving families do not face obstacles. Some of the facilities are
👉Ceremonial Hall… pic.twitter.com/SUYPeTW7Z9
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 9, 2023