కేంద్ర మంత్రి బ్యాటింగ్ అదుర్స్ బీజేపీ కార్యకర్త తలకు రక్తం
మధ్యప్రదేశ్‌లో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్నేహపూర్వక మ్యాచ్ ఆడుతుండగా ఆయన కొట్టిన షాట్‌కు బీజేపీ కార్యకర్త తల పగిలిపోయింది. తలకు బంతి బలంగా తగలడంతో తీవ్రగాయమయ్యింది. దీంతో వెంటనే అతడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు మధ్యప్రదేశ్‌లోని ఇటౌరాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇటౌరాలో కొత్తగా ఓ స్టేడియం నిర్మించింది. దీనిని ఇటీవలే ప్రారంభించగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అక్కడ కాసేపు సరదాగా బీజేపీ కార్యకర్తలతో క్రికెట్ ఆడారు. ఈ క్రమంలో ఆయన బ్యాటింగ్ చేస్తుండగా కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు వికాస్ మిశ్రా అనే బీజేపీ కార్యకర్త ప్రయత్నించాడు. కానీ అది నేరుగా వచ్చి అతడి తలను తాకింది.
దానితో మిశ్రా తలకు గాయమై రక్తకారింది అయితే వెంటనే ఆటను ఆపేసిన కేంద్ర మంత్రి అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బీజేపీ నేతల వికాస్‌ను ఆస్పత్రిక తరలించగా. తలకు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక బీజేపీ కార్యకర్త ధీరజ్ ద్వివేది ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్టేడియం ప్రారంభించిన తర్వాత స్నేహపూర్వకంగా మ్యాచ్ ఆడినట్లు ఆయన పేర్కొన్నారు. వికాస్ మిశ్రాకు గాయాలైన వెంటనే ఆటను నిలిపివేసి, అతడ్ని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. జ్యోతిరాదిత్య సింధియా, మాజీ మంత్రి రాజేంద్ర శుక్లా, రేవా ఎంపీ జనార్దన్ మిశ్రాతో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
అంతకు ముందు జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఒక విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు, ఈ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం పాల్గొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సుమారు రూ.240 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భోపాల్ నుంచి సింగ్రౌలితో కలిపే వింధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంపై సీఎం చౌహాన్ ఈ సంందర్భంగా ప్రకటన చేశారు. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానంతరం దాని చుట్టూ 660 కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక సమూహాల అభివృద్ధి జరగనుంది.
ఇది కూడా చదవండి :