Big Breaking: అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా…
Big Breaking: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డిని నియమించినట్టు తెలుస్తుంది. అయితే బండి సంజయ్ ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించారు.
ఇక ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న బండి సంజయ్ కు జేపీ నడ్డా కీలక సూచన చేసినట్లు తెలుస్తుంది. నాయకత్వ మార్పు అవసరమని..అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బండికి నడ్డా చెప్పినట్టు తెలుస్తుంది. ఢిల్లీలో మీ అవసరాలను వాడుకుంటామని బండికి జేపీ నడ్డా చెప్పినట్టు తెలుస్తుంది. దీనితో అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. కాగా తెలంగాణ బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడిగా G. కిషన్ రెడ్డి ని నియమించినట్లు తెలుస్తుంది.