Balgampet: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం….

tirumala

Balgampet: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం….

Balgampet: బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. సోమవారం కల్యాణోత్సవం, మంగళవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు.  ఈనేపధ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ మళ్లింపు.

పార్కింగ్‌ స్థలాలు గ్రీన్‌ ల్యాండ్‌, మాతా ఆలయం, సత్యం థియేటర్‌ వైపు నుంచి ఫతేనగర్‌ వెళ్లే వాహనాలను ఎస్‌ఆర్‌నగర్‌ టీ జంక్షన్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌, అభిలాష్‌ టవర్స్‌, బీకే గూడ ఎక్స్‌ రోడ్డు,శ్రీరామ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు, సనత్‌నగర్‌, ఫతేనగర్‌ రోడ్డులోకి మళ్లిస్తారు. ఫతేనగర్‌ ైప్లెవోర్‌ పై నుంచి బల్కంపేట్‌ ఆలయం వైపు వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జి నుంచి కట్టమైసమ్మ ఆలయం, బేగంపేట్‌ వైపు మళ్లిస్తారు. గ్రీన్‌ ల్యాండ్‌, బాకుల అపార్టుమెంట్స్‌, పుడ్‌ వరల్డ్‌ వైపు నుంచి బల్కంపేట్‌ వైపు వాహనాలను అనుమతించరు, ఈ రూట్‌లో వచ్చే వాహనాలను పుట్‌ వరల్డ్‌ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి సోనబాయి ఆలయం, సత్యం థియేటర్‌, మైత్రివనం వైపు పంపిస్తారు.

బేగంపేట్‌, కట్టమైసమ్మ ఆలయం నుంచి బల్కంపేట్‌ వైపు వచ్చే వాహనాలను అనుమతి లేదు, ఈ వాహనాలను గ్రీన్‌ ల్యాండ్స్‌, మాత ఆలయం, సత్యం థియేటర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. ఎస్‌ఆర్‌ నగర్‌ టీ జంక్షన్‌ నుంచి బల్కంపేట్‌ వైపు వచ్చే లింక్‌రోడ్డు, బై లేన్లను మూసేస్తారు. ఆర్‌ అండ్‌ బీ అఫీస్‌, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌, పద్మ శ్రీ నుంచి నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ వైపు, ఫతేనగర్‌ రైల్వే బ్రిడ్జి కింద, పద్మ శ్రీ నుంచి ఆర్‌ అండ్‌ బీ వైపు ఉన్న స్థలాలలో పార్కింగ్‌ చేసుకోవాలి.

అయితే మూడు రోజుల పాటు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి మంచి గుర్తింపు ఉంది. నగరంలో ప్రముఖ దేవాలయంగా ఈ టెంపుల్‌కి పేరుంది. దీంతో భక్తులు కల్యాణం చూసేందుకు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఆషాడమాసంలో కల్యాణం నిర్వహిస్తారు. ఆషాడమాసం మొదలవ్వడంతో ఇప్పుడు కల్యాణం నిర్వహిస్తున్నారు. ఎండాకాలం కావడంతో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh