Avinash : రెడ్డికి హైకోర్టులో భారీ ఊరటమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్
రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శనివారం వాదనలు జరిగాయి.
సునీత తరపు న్యాయవాది అవినాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను కొట్టి వేయాలని కోరారు.
ఈ సమయంలో సీబీఐ తన వాదనలు వినిపించింది. అనేక అంశాలను ప్రస్తావించింది. కోర్టు కూడా పలు ప్రశ్నలు సంధించింది.
ఈ క్రమంలో అవినాష్ రెడ్డి బెయిల్ పై తీర్పును బుధవారం వెల్లడించనుంది.
అయితే అప్పటివరకు తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని అవినాష్ రెడ్డి కోరారు.
అయితే.. ఈ కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నిన్నటి నుంచి వాదనలు జరుగుతుండగా.
. వాటికి కొనసాగింపుగా ఈరోజు కూడా హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విషయంలో ఇరువైపులా వాదనలు హోరా హోరీగా సాగాయి.
ఈ హత్య కేసులో కీలకంగా మారని లేఖపై సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేక హత్య కేసు రోజున దొరికిన లేఖను
దాచిపెట్టడంలో ఎలాంటి కుట్ర లేదని సీబీఐ తేల్చేసింది. సేఫ్టీ కోసమే ఆ లేఖను దాచి పెట్టమన్నారని తేలిందని కోర్టుకు తెలిపింది.
ఈ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామన్న సీబీఐ… అందులో ఉన్న హ్యాండ్ రైటింగ్ వైఎస్ వివేకదేనని స్పష్టమైనట్టు వెల్లడించింది.
అవినాష్ రెడ్డి Avinash : రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట కేసు దర్యాప్తునకు సహకరించడంలేదని,
అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది.
దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ అవినాష్ కోరుకున్నట్లు కాదని స్పష్టం చేసింది.
దర్యాప్తును జాప్యం చేయాలని, దాంతో లబ్ధి పొందాలని అవినాష్ చూస్తున్నారని వాదించింది.
విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు గైర్హాజరు అవుతున్నారని తెలిపింది.
అసలు వివేకా హత్యకు ప్రధాన కారణమేంటని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది.
రాజకీయ ఉద్దేశాలే వైఎస్ వివేకా హత్యకు ప్రధాన కారణమని సీబీఐ ఆరోపించింది. వివేకా హత్యకు.
. నెల రోజుల ముందు నుంచే కుట్ర జరిగిందని సీబీఐ ఆరోపించింది.
శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని సీబీఐ ఆరోపించింది
అయితే.. అవినాష్ రెడ్డి మాత్రం విచారణకు సహకరించడం లేదని న్యాయస్థానానికి సీబీఐ చెప్పింది.
నోటీసులు ఎప్పుడు ఇచ్చినా విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారన్నారు.
కోర్టులకు వెళ్లి నోటీసులు తెచ్చుకుని కాలయాపన చేస్తున్నారని తెలిపింది.
ఈ కేసులో ఇప్పటికే పలువురుని విచారించామని మరికొందరిని Avinash : రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట అరెస్ట్ చేశామని తెలిపిస అవినాష్ రెడ్డి వాళ్లెవ్వరీ లేని
ప్రత్యేకత అవినాష్ రెడ్డికి ఏందుకంటూ ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది