AP High Court: జీవో నెంబర్ 1 కొట్టి వేసిన హైకోర్ట్
ఏపీలో సంచలనంగా మారిన జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. బహిరంగ ప్రదేశాలు..రద్దీ కూడళ్లలో సభలు..సమావేశాలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని పైన ప్రతిపక్ష పార్టీలు హైకోర్టులో సవాల్ చేశాయి. దీని పైన విచారణ చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను కొట్టి వేసింది. ఈ జీవో ప్రాధమిక హక్కలకు భంగం వాటిల్లేదిగా ఉందని అభిప్రాయపడింది. ఈ తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉంది.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభలలో తొక్కిసలాట ఘటనలతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జీవో ప్రాధమిక హక్కులకు విఘాతంగా ఉందని పిటీషనర్ల తరపు న్యాయవాదులు AP High Court: వాదించారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు సభలు ఏర్పాటు చేసుకోకుండా ఈ జీవో తీసుకొచ్చిందని ఆరోపణలు చేసాయి. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించింది.
అయితే ఇది ప్రతిపక్షాలకే కాదని, అధికార పార్టీకి వర్తిస్తుందని వైసీపీ నేతలు స్ఫష్టం చేసారు. దీని పైన తొలుత వెకేషన్ బెంచ్ జడ్జి జీవో నెంబర్ 1 ను సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వం అప్పీల్ చేసింది. విచారణ చేసిన డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఇందులో భాగంగా జీవో నెంబర్ 1 ను సస్పెండ్ చేసింది. AP High Court: ఈ జీవో ప్రాధమిక హక్కులకు విఘాతంగా ఉందని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. : సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వం అప్పీల్ చేసింది. విచారణ చేసిన డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది.