AP Grama Sachivalayam Jobs: గ్రామ ‘సచివాలయాల్లో’ 14,523 ఖాళీలు, త్వరలోనే నోటిఫికేషన్ల వెల్లడి!

ఈసారి కూడా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్‌ శాఖకు లేఖ కూడా రాసింది.

ఏపీలోని నిరుద్యోగులకు ఇది శుభవార్త. త్వరలో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుంది. 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేసి ఏప్రిల్‌లోగా ఖాళీల భర్తీకి రాతపరీక్షలు పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల భర్తీ ప్రక్రియ పూర్తి కానుంది. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతూ ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ శాఖ పంచాయతీరాజ్ శాఖకు లేఖ రాసింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలను లేఖలో పేర్కొన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 20 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులను పంచాయితీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయం, పశుసంవర్ధక, సాంఘిక సంక్షేమం, ఉద్యానవన, సెరీకల్చర్, మత్స్య, వైద్య, ఆరోగ్యం మరియు హోం శాఖల సంబంధిత శాఖలు పర్యవేక్షిస్తాయి. పంచాయితీ రాజ్ శాఖ ప్రతి స్థానానికి సంబంధించిన వివరాలను మరింత నిశితంగా సమీక్షించేందుకు వీలుగా ఓపెన్ జాబ్ ఖాళీల గురించి శాఖాధిపతుల నుండి సమాచారాన్ని సేకరిస్తోంది. మూడు నెలల్లో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు భావిస్తున్నారు.

మిగిలిన ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పంపినా ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల్లోనే అత్యంత పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ చేయకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి మూడో దఫా నోటిఫికేషన్‌ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh