AP CM : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సీఎం
AP CM : ఏపీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పారు.
ఇప్పటికే తన ప్రభుత్వంలో భాగంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్ధలో కీలకంగా ఉన్న
ఉద్యోగులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్న సీఎం జగన్ ఇవాళ వారికి మరో
శుభవార్త తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోటు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీలపై వెళ్లేందుకు సైతం ఆమోదం తెలిపారు.
ఈ మేరకు ఫైలుపై సంతకం చేశారు.ఈ విషయాన్ని ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి తెలిపారు.
జూన్ 10 వరకు సచివాలయ AP CM : ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించారని చెప్పారు.
రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులన్నారు.
జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారని తెలిపారు.
జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారని చెప్పారు.అంతర్ జిల్లా
బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించారు.
కాగా.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో 1.67 లక్షల మంది పనిచేస్తుండగా.
ఆ శాఖలో మూడేళ్లుగా బదిలీలు లేవు ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు
రాష్ట్రంలో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల్ని కూడా చేపట్టాలని ఉద్యోగ
సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సాధారణ ఉద్యోగుల బదిలీలతో
పాటే వీరికి కూడా బదిలీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది.
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు
తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
అలాగే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఇస్తూ జగన్ సర్కార్ ఇటీవలే నిర్ణయం
తీసుకున్న విషయం తెలిసిందే. 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన వారికి ప్రొబేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
శాఖాపరమైన పరీక్షలో పాసవ్వడంతో పాటు, 2 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ చేసుకున్న వారికి
ప్రొబేషన్ వస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. AP CM : ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి ఉద్యోగులకు కొత్త పే స్కేళ్లు వర్తిస్తున్నాయి.