AP : లో జై తెలుగు పార్టీని ప్రకటించిన…. సీనియర్ రచయిత

AP

AP : లో జై తెలుగు పార్టీని ప్రకటించిన…. సీనియర్ రచయిత

AP :  ఏపీలో వచ్చే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే కొన్ని పార్టీలు సింగల్ గా వెళ్ళితే మరికొన్ని పార్టీలు పొత్తులతో రెఢీ అవుతున్నాయి .

మరికొన్ని విపక్ష పార్టీలు ఒంటరి పోరుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో కొత్తగా పలు రాజకీయ పార్టీలు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి

ఈ నేపధ్యంలోనే విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో  టాలీవుడ్ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ‘జై తెలుగు పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.

అయితే త్వరలో అధికారికంగా దీన్ని ప్రారంభించబోతున్నారు. తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు రాజకీయ నాయకులకు,

ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్

చాలా నష్టపోయిందని, తెలుగు భాష, సంస్కృతి విలువ కోల్పోయిందని, విలువల పునరుద్ధరణకు రాజకీయ నాయకులు, ప్రజలు కృషి చేయాలన్నారు.

అలాగే తెలుగు భాష పరిరక్షణ అజెండాగా వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లలో పోటీచేయబోతున్నట్లు జొన్నవిత్తుల పేర్కొన్నారు.

అయితే ఈ పార్టీని ఇంకా రిజిస్టర్ చేయించారా లేదా అన్నది స్పష్టత లేదు.

విలువల కోసం ఇటు ప్రజలు అటు రాజకీయ నాయకులు నిలబడి పనిచేయాలనేది తన సంకల్పమని దీనికోసమే “జై తెలుగు” ఒక పథాకాన్ని కూడా రూపకల్పన చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తన పార్టీ గుర్తు “రథం” అని జొన్నవిత్తుల ప్రకతించారు.

ఈ సందర్భంగా ఈ తెలుగు ప్రగతి రథం పరుగులు పెట్టడంకోసం నాయకులు ప్రజలు పార్టీలను పక్కనపెట్టి కార్యనిర్వహణ దక్షులుగా నిలబడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం!

బ్లూ కలర్ ను పోలిన ఐదు రంగులతో కూడిన జెండాను రూపొందించానని, వ్యవసాయానికి ఆకుపచ్చ, కృషికి ఎరుపు, కీర్తికి పసుపు, స్వచ్ఛమైన నీటి వనరులకు తెలుపు రంగును రూపొందించానని చెప్పారు. తెలుగు భాష కోసం ఐదుగురు మహానుభావులు కష్టపడి, త్యాగం చేశారని, తన జెండాలో మహానేతలు గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉన్నారని చెప్పారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh