IND vs AUS: కేఎస్ భరత్‌కు మరో ఛాన్స్ కానీ డబుల్ సెంచరీ హీరోకి షాక్
అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకు భారత జట్టులో మార్పులు ఉంటాయని అంతా భావించారు. పదే పదే విఫలమవుతున్న ఆటగాడికి బదులు డబుల్ సెంచరీ హీరోకి రోహిత్ అవకాశం ఇస్తాడని మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ పిక్స్ అయ్యారు కానీ రోహిత్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూఫ్లాప్ ఆటగాడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఫ్లాప్ ఆటగాడు ఎవరో కాదు మన తెలుగు తేజం కేఎస్ భరత్. ఈ సిరీస్‌లో వికెట్ కీపర్ కేఎస్ భరత్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్‌లు ఆడిన భరత్ 5 ఇన్నింగ్స్‌ల్లో 57 పరుగులు మాత్రమే చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ద్వారా భారత్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు భరత్. ఈ ప్లాఫ్ ప్రదర్శనతో నాలుగో టెస్ట్ లో భరత్ కు చోటు దక్కదని అందరూ భావించారు.
అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయం కారణంగా రిషబ్ పంత్ క్రికెట్‌కు దూరమయ్యాడు. అందుకే ఈ టెస్టు సిరీస్‌కి కేఎస్ భరత్‌ను టీమ్ ఇండియాలో ఎంపిక చేశారు. తొలి మూడు టెస్టుల్లో విఫలమైన తర్వాత భరత్ ప్లేసులో ఇషాన్ కి చోటు దక్కడం ఖాయమనుకున్నారు. కానీ ఇషాన్ వైపు మొగ్గు చూపలేదు రోహిత్. అహ్మదాబాద్ టెస్టులోనూ కేఎస్ భరత్‌కు మరోసారి అవకాశం ఇచ్చాడు. దీంతో డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ కు మొండిచేయి ఎదురైంది. ఇక, సిరీస్ ను మరోసారి సొంతం చేసుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించుకుంటే చాలు. అయితే అంతకంటే పెద్ద లక్ష్యాన్ని భారత్ తన ముందు ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అలాగే ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. మొహమ్మద్ సిరాజ్ కు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకుంది. ఆస్ట్రేలియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. 75 ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా బంధానికి గుర్తుగా ఈ మ్యాచ్ తొలి రోజు ఆటకు భారత, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ ఆంథోనీ అల్బనీస్ లు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి :