Andhra Pradesh: ఒంగోలు బ్యాంలోకు విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు కాల్చుకుని చనిపోయాడు
Andhra Pradesh: ఒంగోలు జిల్లాలోని యూనియన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు సోమవారం విధులు నిర్వహిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గార్డు రూం నుంచి పెద్ద ఎత్తున తుపాకీ శబ్దం వినిపించడంతో బ్యాంకు సిబ్బంది అక్కడికి చేరుకుని చూడగా 35 ఏళ్ల వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
వివరాల ప్రకారం వెంకటేశ్వర్లు తన సర్వీస్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బ్యాంకు ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే అతనికి పెళ్లయిందని, పిల్లలు లేరని పోలీసులు తెలిపారు.
చీమకుర్తికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య ఉమా మహేశ్వరితో కలిసి ఒంగోలు పట్టణంలోని రామ్‌నగర్‌లోని 8వ లైన్‌లో నివాసం ఉంటున్నాడు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరొక ఘటన లో నలుగురు మృతి కృష్ణానదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తు మునిగిపోయి మృత్యువాత పడ్డారు.
అసలు వివరాలలోకి వెళ్ళితే సోమవారం ఈత కోసం మేనత్త కుమారుడైన ఇమాంతో కలిసి ఇస్మాయిల్ కుమారులు సమీర్(18), రియాన్(14), ఇబ్రహిం కూతుళ్లు ఆఫ్రిన్(17), నవసీన్ (13)తో పాటు మరో ఐదుగురు కలిసి ఆటోలో మంగంపేట శివారులో కృష్ణానదికి వెళ్లారు.
ఈ క్రమంలో నదిలో లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో రియాన్ మునిగిపోగా.. ఆఫ్రిన్, నవసీన్ కాపాడటానికి వెళ్లగా.. ముగ్గురికీ ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. వెంటనే వీరిని కాపాడేందుకు వెళ్లిన సమీర్ సైతం నీటిలో మునిగిపోయాడు.
నలుగురు గల్లంతవడంతో ఇమాం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటన స్థలి వద్ద ఆర్తరోదనలు మిన్నంటుతున్నాయి.