Andhra Pradesh: రైతులకు గుడ్ న్యూస్

Andhra Pradesh:

Andhra Pradesh: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

Andhra Pradesh: ఏపీలో రైతులకు శుభవార్త చెప్పింది జగన్  ప్రభుత్వం.

వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధుల రాని వారు కోసం వ్యవసాయశాఖ మరో అవకాశం ఇచ్చింది .

అయితే   మొదటి విడత రైతు భరోసా  కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 నుంచి 18 వరకు అర్హత కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

రైతు భరోసాకు కొత్తగా అర్హత పొందిన వారితో పాటూ అర్హత కలిగి లబ్ధి పొందని రైతులు. అటవీ భూమి సాగుదారులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సందర్బంగా అర్హులకు సంబంధించి అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.

కొత్తగా 90,856 మంది భూయజమానులు..6,642 మంది అటవీ భూమి సాగుదారులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

గతేడాది లబ్ది పొందిన వారు కొత్తగా ధరఖాస్తు  చేసుకున్న వారిలో అర్హుల, అనర్హుల జాబితాలను  రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించామన్నారు.

ఇక ఈనెలలోనే తొలి విడత పెట్టుబడి సాయం విడుదల చేయనున్న నేపథ్యంలో అర్హత కలిగిన వారికీ అవకాశంఇచ్చింది.

ఒకవేళ అర్హుల జాబితాలో ఎవరైనా అనర్హులుగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

రైతు భరోసాకు అర్హతలు ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే..

ఈ నెల 18 వరకు గడువు ఉందని Andhra Pradesh: గుర్తు చేశారు. ఒకవేళ గతేడాది రైతు భరోసా లబ్ధి పొంది. ప్రస్తుతం మరణించినట్లైతే వారి భార్య లేదా భర్త నామినీగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

భూమికి సంబంధించిన పత్రాలు, ఆధార్‌ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

గతేడాది లబ్ధి పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారికి ఈ ఏడాది యధావిధిగా రైతు భరోసా సాయం అందుతుందని అధికారులు తెలిపారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రైతు భరోసా స్కీమ్ కింద ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోంది.

తొలి విడతగా రైతు అకౌంట్ లో రూ.5వేల 500 చొప్పున జమ చేయనున్నారు.

ఈ సంవత్సరం మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.

వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ప్రతి సంవత్సరంAndhra Pradesh:  మూడు విడతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

మిగిలిన రూ. 7,500 జగన్ సర్కార్ అందిస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh