Anagani Satya Prasad Vs Peddi Reddy
మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద వేటు పడింది .
వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పెద్దెత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారు.
తప్పుచేసి తప్పించుకోవడం సాధ్యం కాదని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ లు తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
మదనపల్లె ఫైళ్ళ దగ్థం కేసు విచారణ వేగంగా జరుగుతోందని చెప్పారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్ళలో భూములకు సంబంధించిన వందల ఫైళ్ళు దొరికాయి.
మదనపల్లె ఫైళ్ళ దగ్థం కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు.
పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని మంత్రి పేర్కొన్నారు.
తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బాధితులు ఉన్నారని, వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతామని అన్నారు.
ప్రజా ధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు . మొత్తానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద అనగాని సత్య ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .
Anagani Satya Prasad Vs Peddi Reddy