ఈ రోజు హైదరాబాద్‌కు విచ్చేయునున్న అమిత్ షా
ఈ రోజూ హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రి అమిత్ షా. శనివారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ లో జరిగే ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొనేందుకు ఆయన నగరానికి వస్తున్నారు.ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈ రోజు రాత్రి 10:15 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి నేరుగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి రోడ్డుమార్గం ద్వారా వెళ్ళనున్నారు . అయితే అమితా షా రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
రేపు (శనివారం) ఉదయం 7:50 గంటల నుంచి 10:30 గంటల వరకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో నిర్వహించే ఐపీఎస్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొంటారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏలో)లో మొత్తం 195 మంది (74వ బ్యాచ్) ఐపీఎస్‌ల ట్రైనింగ్ పూర్తయింది. వారికి శనివారం పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నట్లు పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ గురువారం వెల్లడించారు. ట్రైనింగ్ పూర్తి చేసిన వారిలో 129 మంది పురుషులు, 37 మంది మహిళలు సహా 29 మంది రాయల్ భూటాన్, నేపాల్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు అమిత్ షా ట్రోఫీలను అందజేస్తారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమంగానే కొనసాగనుంది. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేకపోవడం ఆశ్చర్యం గా ఉంది.
కోవిడ్ తర్వాత పూర్తిస్థాయిలో జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ ఇదేనని ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ ఏడాదితో NPA 75 వసంతాలు పూర్తి చేసుకుంటుందని వెల్లడించారు. ఐపీఎస్‌లకు అమిత్ షా ట్రోఫీలను అందజేసిన అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు భోజన విరామం ఉంటుంది. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి శంషాబాద్‌కు పయనమవుతారు. మధ్యాహ్నం 1:20 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు అమిత్ షా మళ్లీ ఢిల్లీకి బయల్దేనున్నారు.
ఇది కూడా చదవండి :