ఈ కొండ చిలువ తెలివికి …హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఇటీవలి కాలంలో కొండ చిలువలు, పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని చూడటానికి భయంకరంగా ఉంటo.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారీ కొండ చిలువ అడవిలో ఉన్న ఓ పొడవైన చెట్టు ఎక్కుతున్నప్పుడు ఓ టెక్నిక్ ఉపయోగించింది. ముందు చెట్టును చుట్టుకుని ఆ తర్వాత తలతో పైకి పాకుతోంది. కొండ చిలువ అదే పద్ధతిని ఫాలో అయి చెట్టు చివరి వరకు వెళ్లిపోయింది.
2.UP మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత.
UP మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో వెంటిలేటరైన చికిత్స పొందుతున్న ములాయం.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ములాయం కిడ్నీ, యూరిన్ ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడ్డారు. ములాయం కేంద్ర రక్షణ మంత్రిగా, 3 టర్మ్ లు యూపీ సీఎంగా సేవలు అందించారు.ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం అన్నారు. ములాయం తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు.ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అకాల మరణంపై టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంపాటు ప్రజా జీవితంలో ఆయన ఉన్నారని అన్నారు. ఆయన మరణం బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని తెలిపారు.
3.కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ షాక్…తమ్ముడి కోసమేనా?
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్..ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ తన నిర్ణయంతో పార్టీ నేతలకు జలక్ ఇచ్చారు. సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి -కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు మునుగోడు బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడిన సమయం లో టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు చేసిన వ్యాఖ్యల పైన వెంకటరెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యల పైన విచారం వ్యక్తం చేసారు.
మునుగోడు ఎన్నికల ప్రచారంలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారంటూ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు.కానీ, ఈ సమయంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. అందుకు ఈ నెల 15వ తేదీ ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. నవంబర్ 3న మునుగోడు ఎన్నికల పోలింగ్..6న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
అవి పూర్తయిన తరువాతనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగి హైదరాబాద్ రానున్నారు.ఇప్పుడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఇష్టం లేకనే..ఆయన కుటుంబంలో విభేదాలకు అవకాశం ఉండదనే ఆలోచనతోనే ఈ విదేశీ ట్రిప్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
4.జగన్ నే కాపీ కొడుతోన్న కేసీఆర్..
మునుగోడు ఉపఎన్నిక వచ్చే నెల జరగనుంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మునుగోడులో ఎలాగైనా గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ గెలుపు కోసం భారీగానే వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే భారీ సంఖ్యలో ఉపఎన్నిక కోసం సీఎం కేసీఆర్ ఇన్ చార్జ్ లను నియమించారు. నిజానికి.. ఇదంతా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటి నుంచో చేస్తున్నది.
ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్రతి ఎమ్మెల్యేను వాళ్లు నియోజకవర్గంలో ఉండాలని, ప్రతి గడపకు వెళ్లాలని, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు..ఒక ఎమ్మెల్యే ఒక ఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లాలి. గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్లడం ద్వారా మాత్రమే ఓటర్లను ఆకట్టుకోగలమని కేసీఆర్ స్పష్టంగా చెప్పుకొచ్చారు.
ప్రచారంలో పాల్గొనే విషయాలు, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తాను ఫీడ్ బ్యాక్ తెప్పించుకొని చూస్తానని కూడా సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇదివరకు ఎప్పుడూ ఏ ఎన్నికను కూడా సీఎం కేసీఆర్ ఇంత సీరియస్ గా తీసుకున్నది లేదు. కానీ.. మునుగోడును మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు.
5.రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఆయన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటి?
హీరోల వెనుక ఎప్పుడూ పడడు రాజమౌళి. ఆయన పరుగెప్పుడూ కథ వెనుకే. పాత్రల వెంబడే. క్యారక్టరైజేషన్ కోసమే. పూర్తిగా కథ, స్ర్కీన్ ప్లే లాక్ చేసుకొని కానీ హీరోలను సెలెక్ట్ చేసుకోకపోవడం జక్కన్న సక్సెస్ సీక్రెట్స్ లో ఒకటి……సక్సెస్ మీనింగ్ కోసం డిక్షనరీ వెతికితే దర్శకుడు రాజమౌళి పేరు కనిపిస్తుంది. పర్ఫెక్షన్ కు ఆయన సరైన డెఫినిషన్. డిసిప్లైన్ కు పెట్టింది పేరు. ఎందులోనూ రాజీపడకపోవడం ఆయన క్యారక్టర్.
అందుకే ఆయనకి ఫ్లాప్ సినిమా తీయడం రాదు. ఇంతకీ ఆయన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటి?
డైరెక్టర్ రాజమౌళి ఓ ప్రభంజనం. ఓ సంచలనం. ఆయన పేరు వింటే తెలుగు ఆడియన్స్ ఊగిపోతారు. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుంది. హీరోలను మించిన ఫాలోయింగ్ ఆయన స్పెషాలిటీ. మిగతా సినిమాలకు హీరోను బట్టి మార్కెట్ ఉంటుంది. కానీ జక్కన్న సినిమాలకు ఆయన పేరే బ్రాండింగ్. హీరో ఎవరన్నది ముఖ్యం కాదు. తీసింది జక్కన్నా కాదా అన్నదే మెయిన్. ఆయన తీసింది పన్నెండు సినిమాలే. అయితేనేం? ఆయన క్రేజ్ వంద డైరెక్టర్ల క్రేజ్ కన్నా ఎక్కువ.హీరోల వెనుక ఎప్పుడూ పడడు రాజమౌళి. ఆయన పరుగెప్పుడూ కథ వెనుకే. పాత్రల వెంబడే. క్యారక్టరైజేషన్ కోసమే. పూర్తిగా కథ, స్ర్కీన్ ప్లే లాక్ చేసుకొని కానీ హీరోలను సెలెక్ట్ చేసుకోకపోవడం జక్కన్న సక్సెస్ సీక్రెట్స్ లో ఒకటి. స్టోరీ కోసం ప్రాణం పెట్టడం. అందులోని పాత్రలకోసం పరితపించిపోవడం, ప్రతీ చిన్న విషయంలోనూ శ్రద్ద తీసుకోవడం.
ఇలా అన్ని రకాలు గానూ తన తీయబోయే సినిమా గురించి శ్రమించడం రాజమౌళి నైజం. సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి అవసరమైన ఇతర క్రాఫ్ట్స్ పై కూడా ఆయన విపరీతమైన పట్టు సాధించారు…రాజమౌళి లాంటి అద్భుతమైన డైరెక్టర్ మనకు లభించడం, ఆయన ఇండియా గర్వపడే దర్శకుడిగా ఎదగడం మనకు ఎంతైనా గర్వకారణం…ఈ సందర్బంగా రాజమౌళికి pregnya media తరుపు నుంచి happy birthday.
6.తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్ .. బిడ్డల ఆరోగ్యంపై శాస్త్రవేత్తల ఆందోళన..
బిడ్డలో రోగ నిరోధక శక్తి పెంచే తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. కానీ ఆ తల్లిపాలు కూడా కల్తీ అవుతున్నాయా? అంటే నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించిన పరిశోధకులు బిడ్డల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం అని డాక్టర్లు పదే పదే చెబుతుంటారు. మన పెద్దలు కూడా అదే చెప్పారు. ఎందుకంటే తల్లి పాలు కల్తీ ఉండదు.
బిడ్డలో రోగ నిరోధక శక్తి పెంచే తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. కానీ ఆ తల్లిపాలు కూడా కల్తీ అవుతున్నాయా? అంటే నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. మరి బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంటీ? అనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు శాస్త్రవేత్తలు. తల్లి పాలల్లో ‘మైక్రో ప్లాస్టిక్’ఉందని ఇటలీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రో ప్లాస్టిక్ కలిగిన పాలు తాగితే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కానీ తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్ ఉన్నప్పటికీ బిడ్డకు తల్లిపాలు పట్టటం మానవద్దని సూచిస్తున్నారు.
మైక్రో ప్లాస్టిక్ తో కలిగే నష్టాల కంటే తల్లిపాల వల్ల అందే ప్రయోజనాలే ఎక్కువని అందుకు తల్లిపాలే బిడ్డలకు పట్టాలని సూచిస్తున్నారు.గర్భిణులు, తల్లులు ప్యాకేజ్డ్ ఫుడ్, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.తల్లి పాలల్లో పాలిథైలీన్ , పీవీసీ, పాలిప్రొపిలీన్ వంటి ప్యాకేజింగ్ లో వినియోగించే పదార్థాలను ఈ పరిశోధనలో కనుగొన్నారు. పరిశోధన కోసం ఇటలీ రోమ్ లో.. 34మంది ఆరోగ్యవంతులైన తల్లుల బ్రెస్ట్ మిల్క్ ని సేకరించారు. వీరందరు.. బిడ్డ పుట్టిన వారం రోజుల తర్వాత.. పాలను పరిశోధనకు ఇచ్చారు. వీటిల్లో 75శాతం మందిలో మైక్రోప్లాస్టిక్స్ పదార్థాలను గుర్తించారు పరిశోధకులు.
7. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ‘పుష్ప’ క్లీన్ స్వీప్: అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా.. ఫిల్మ్‌ఫేర్‌లో అత్యధిక అవార్డులను పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా.. ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ‘ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ మేల్ సింగర్, ఉత్తమ ఫీమేల్ సింగర్ & ఉత్తమ చిత్రం’ కేటగిరీల్లో అవార్డులు వచ్చినట్లు ట్వీట్ చేశాడు.
8. టాలీవుడ్లో MS ధోనీ కొత్త ఇన్నింగ్స్..
టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే పలు విభాగాల్లో పెట్టుబడులు పెట్టిన అతను.. ఈసారి సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. ‘ధోనీ ఎంటర్టైన్మెంట్’ పేరుతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలను నిర్మిస్తాడని తెలుస్తోంది. అతి త్వరలోనే ప్రొడ్యూసింగ్ కంపెనీని లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
9.10 ఏళ్ల తర్వాత ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్స్తో ..
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పదేళ్ల తర్వాత ఎడమ చేత్తో బ్యాటింగ్ అలవాటున్న ఐదుగురు ఆటగాళ్లతో ఆడింది. 2012లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గంభీర్, రైనా, పార్థీవ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, రవీంద్ర జడేజా ఆడారు. నిన్న శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ జట్టులో భాగమయ్యారు.