వీల్ చైర్ లో వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీఎస్‌

తెలంగాణ సీనియర్‌ పొలిటీషియన్ ధర్మపురి శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆరోగ్యం సహకరించకపోయినా వీల్ ఛైర్ లో గాంధీ భవన్ కు వచ్చి మరో సారి కాంగ్రెస్ పార్టీ కందువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమం అంతా హైదరాబాద్ గాంధీభవన్‌‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల సమక్షంలో డి. ఎస్ కాంగ్రెస్ కందువ కప్పుకున్నారు.

కానీ డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరిక ప్రక్రియ ముందు పెద్ద నాటకీయ పరినమమే జరిగింది. కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ ముందుగా డీఎస్‌ పేరుతో ఓ లేఖ విడులైంది. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్‌ స్వయంగా ప్రకటించారు.  అయితే, డీఎస్ పేరుతో విడుదలైన లేఖ లో తన కుమారులు ఇద్దరి లో ఒకరు కాంగ్రెస్ లో మరొకరు బీజేపీలో పార్టీలలో ఉంటూ  తెలంగాణ కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. అంటే కానీ తాను మాత్రం కాంగ్రెస్ లో చేరటం లేదనేది లేఖ తెలిపారు.

కానీ, నిమిషాల వ్యవధిలో మొత్తం సీన్ మారిపోయింది.  వీల్‌చైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చి మరి డీఎస్‌ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ లో చేరడం చాలా సంతోషం గా ఉందని అన్నారు.

కాగా ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్‌)  తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత. తెలంగాణ రాజకీయాలలో పరిచయం లేని వ్యక్తి. సుదీర్ఘ కాలం ఆయన కాంగ్రెస్ లో అనేక హోదాల్లో పని చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా  వ్యవహరించారు. వైఎస్సార్ తో కలిసి 2004, 2009 లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తరువాత మారిన రాజకీయ సమీకరణాల్లో ఆయన నాటి టీఆర్ఎస్ లో చేరారు. రాజ్యసభ సభ్యుడు అయ్యారు.

కానీ, టీఆర్ఎస్ లో డీఎస్ కొంత కాలానికే దూరమయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో సమావేవమయ్యారు. అప్పట్లోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా  సాగింది. ఇప్పుడు ఇన్ని రోజులకు ఆయన మళ్ళీ పార్టీ కందువా కప్పుకున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh