RGV: చంద్రబాబుకు బర్త్‌డే గిఫ్ట్‌

RGV

RGV: చంద్రబాబుకు బర్త్‌డే గిఫ్ట్‌

RGV: సంచలనాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచే వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా అంటే  వెంటనే అందరికి గుర్తుకు వచ్చే పేరు దర్శకుడు RGV. నిత్యం ఏదో ఒక వివాదంలో దూరడం అంటే ఆర్జీవీకి సరదా. సినిమా, రాజకీయ నాయకులు గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం.లేదంటే చిల్లర ఇంటర్వ్యూలు, అమ్మాయిలు, ఆర్టిస్ట్‌లతో హగ్గులు, పెగ్గులు అంటూ సోషల్‌ మీడియాలో రచ్చ చేయడం ఆర్జీవీకి అలవాటు. కొన్ని రోజుల క్రితం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖావాణితో కలిసి.. ఆర్జీవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇక తాజాగా మరో సంచలన ట్వీట్‌ చేసి.. వార్తల్లో నిలిచాడు RGV. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  బర్త్‌డే సందర్భంగా ఆర్జీవీ చేసిన ట్వీట్‌ తెగ వైరలవుతోంది.

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పుట్టినరోజు. 73వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే   చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు వైసీయర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు టీడీపీ నేతలు,పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు  తెలుగు తమ్ముళ్లు సోషల్‌ మీడియా వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా  జరిగాయి. అలాగే చంద్రబాబు జన్మదిన  సందర్భంగా దర్శకుడు RGV చంద్రబాబు నాయుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే బర్త్ డే గిఫ్ట్‌ కూడా ఇస్తున్నానని. మధ్యాహ్నం 12 గంటలకు సర్‌ప్రైజ్ ఉందని ప్రకటించారు. తాజాగా ఆ సర్ ప్రైజ్ రివీల్ చేశారు అర్జీవీ. SickoPsycho సాంగ్ విడుదల చేశారు.

చంద్రబాబు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో  ఆయన జన్మదిన వేడుకల కోలాహలం నెలకొంది. నియోజకవర్గంపై పట్టు కోల్పోలేదని నిరూపించుకునేలా ఈ ఏర్పాట్లను సాగిస్తోన్నారు టీడీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టారు. నియోజకవర్గ కార్యాలయాన్ని అలంకరించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh