వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

Asia Cup 2023 :వరల్డ్ కప్‌ను తాము బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

ఆసియా కప్ 2023 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే . దాంతో ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా, పాక్ కు రాదు అని బీసీసీఐ చెప్పింది. గత కొన్ని నెలలుగా ఈ టోర్నీ నిర్వాహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ టోర్నీ విషయమై ప్రధాని మోదీని కలుస్తానని పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్ తో తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక భారత్-పాక్ మధ్య ఇప్పటికీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం మనందరకు తెలిసిందే. దాంతో ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా క్రికెట్ ఆడటానికి పాక్ లో అడుగుపెట్టలేదు. కానీ భారత క్రికెట్ జట్టు ఎలాగైనా సరే తమ దేశంలో అడుగుపెట్టాలని పాకిస్థాన్ కోరుకుంటోంది.

అయితే 2008లో ముంబై ఉగ్రదాడి ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈసారి ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా తటస్థ వేదికపై ఆసియా కప్ జరుగుతుందని భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని బీసీసీఐ సెక్రటరీ, ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ హెడ్‌గా కూడా ఉన్న జై షా గతంలో ప్రకటించారు.

కాగా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటనను పీసీబీ ఖండించింది. తమతో మాట మాత్రం కూడా చెప్పకుండానే.. ఆసియా కప్‌ను తటస్థ వేదికకు మారుస్తామని ఎలా ప్రకటిస్తారని పీసీబీ ప్రశ్నించింది. భారత జట్టు తమ దేశంలో పర్యటించకపోతే.. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను తాము బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది.

కాగా ఇరు దేశాల మధ్య క్రికెట్ జరగాలన్న పాకిస్థాన్  మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ ఈ విషయమై బీసీసీఐని ఒప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  . బీసీసీఐ ఎంతో బలమైన క్రికెటర్ బోర్డ్ అన్న అఫ్రిదీ భారత్, పాక్ మధ్య సంబంధాలు మెరుగు పడలంటే అంటే దానికి ఒకే ఒక్క దారి క్రికెట్. ఈ క్రికెట్ వల్లే రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయి. దీనికోసం బీసీసీఐ మరింత బాధ్యత తీసుకోవాలన్నాడు.  ఇక ఇంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు స్నేహితులను పెంచుకోవాలి తప్ప, శత్రువులను కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు పాక్ వచ్చి క్రికెట్ ఆడాయని, భద్రత గురించి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక ఈ విషయంపై తాను త్వరలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అఫ్రిదీ.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh