కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యం లో బెంగళూరులో ప్రధాని మోదీ రోడ్ షో ఘనంగా జరిగింది. వరసగా రెండో రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రోజు శనివారం దాదాపుగా 13 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 26 కిలోమీటర్ల మేర మూడు గంటల పాటు మోదీ రోడ్ షో జరిగింది. నేడు (మే 7, ఆదివారం) సుమారు 10 కిలోమీటర్ల పాటు అట్టహాసంగా రోడ్ షో జరిగింది.
ఈ రోడ్డు షో లో వేలాది సంఖ్యలో ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రహ దారిపొడవునా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు మోదీపై పూల వర్షం కురిపించారు. మోదీ.. మోదీ అని నినాదాలు చేశారు. పొడవునా ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. ఆదివారం ఉదయం ముందుగా తిప్పెసాంద్ర రోడ్డు వద్ద ఉన్న కెంపెగౌడ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి రోడ్ షో మొదలైంది. హెచ్ఏఎల్ రెండో స్టేజీ, ఓల్డ్ మద్రాస్ రోడ్డు మీదుగా సాగింది కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార బీజేపీ పట్టుదలగా ఉండగా ప్రధాని మోదీ ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు.
అయితే మొత్తంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను తాకుతూ ఈ రోడ్ షో జరిగింది. చివరగా ట్రినిటీ సర్కిల్లో రోడ్ షో ముగిసింది. బెంగళూరులో మెగా రోడ్ షో ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మోడీ ప్రసంగించన్నున్నారు. ప్రధానిని చూడటానికి రోడ్డుకిరువైపులా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అసలు ముందు బెంగళూరులో ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో రెండు రోడ్ షొలు నిర్వహించడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తూ పక్కాప్లాన్ చేశారు. అయితే బెంగళూరులో విపరీతమైన వనాలు పడుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు రెండు రోజులు నిర్వహించాలని బీజేపీ నాయకులు డిసైడ్ అయ్యారు. శనివారం, ఆదివారం బెంగళూరులో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. శనివారమే 26 కిలోమీటర్ల రోడ్ షో జరిపింది. నేడు ఆ మిగిలిన 10 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించింది.
#WATCH | Prime Minister Narendra Modi begins his roadshow in Bengaluru ahead of #KarnatakaAssemblyElection
PM started his roadshow from the Kempegowda statue at New Tippasandra Road and it will end at Trinity Circle. pic.twitter.com/E0nTk6eifJ
— ANI (@ANI) May 7, 2023