RASHMIKA MAMDANA: రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘ఇంద్రధనుస్సు’. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం
కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. అంతేకాదు తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు. రష్మిక మందన్న’గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రెడ్’ సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది.
అయితే రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘రెయిన్ బో’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నూతన దర్శకుడు శాంతరుబన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్, రావు రమేష్ తదితరులు నటించారు. నిర్మాతలు విడుదల చేసిన ఓ ప్రకటనలో రష్మిక మాట్లాడుతూ “అమ్మాయి కోణం నుంచి చిత్రీకరించిన కథలో తొలిసారి కథానాయికగా నటిస్తున్నాను. ఈ పాత్రను సజీవంగా తీసుకురావడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. రెయిన్ బో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే, ఉత్తేజపరిచే సినిమా. ఈ అమ్మాయితో జర్నీ క్రేజీ రైడ్ గా ఉండబోతోంది కాబట్టి ఇది సరదాగా సాగుతుంది. ద ర్శ కుడు మాట్లాడుతూ – ”ఇండియ న్ సినిమాల్లో రొమాంటిక్ ఫ్యాంట న్ స్టోరీగా రెయిన్ బో ఉంటుంది. రష్మిక మోస్ట్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. ఈ చిత్రం మీ హృదయాలను హత్తుకుంటుంది మరియు అదే సమయంలో, దాని సృజనాత్మక కథనంతో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది” అని అన్నారు. రెయిన్ బో టీమ్ సోమవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణను ప్రారంభించింది. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేయగా నటి అమల అక్కినేని క్లాప్ కొట్టారు. ఏప్రిల్ 7 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
#Rainbow ..🌈
The different colours of life.This is extremely special to me.. 🥹
I hope I have all of your blessings and love.. ❤️❤️
And I really hope and pray that this becomes your next favourite characters of mine.. ❤️❤️😙🌻 https://t.co/2Om3ZSAxvv— Rashmika Mandanna (@iamRashmika) April 3, 2023